
కన్నడ బుల్లితెర నటి వైష్ణవి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. వైష్ణవి గౌడకు ఇప్పటి వరకు 300 వరకు పెళ్లి సంబంధాలు వచ్చినట్లు ఆమె చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది. జీ కన్నడ ఛానెల్‌లో ప్రసారమయ్యే సీతారాం సీరియల్‌లో మెరిసిన వైష్ణవికి ఎన్ని పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయో తెలుసా? అంటూ కన్నడ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది.
కన్నడ బిగ్ బాస్ నందు ఈ సీజన్‌లో పాల్గొన్న వైష్ణవి ఎలిమినేట్ అవుతున్న సమయంలో.. మీకు ఎన్ని లవ్ ప్రపోజల్స్, పెళ్లి సంబంధాలు వచ్చాయని హీరో కిచ్చా సుదీప్ అడుగుతాడు. అందుకు సమాధానంగా వైష్ణవి కూడా కొంత సమయం ఆలోచించి దాదాపు 200 నుంచి 300 ప్రపోజల్స్ వచ్చాయని చెప్పింది. ఇది విన్న సుదీప్, 'అయ్యో.. వీటిలో ఒక్క ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ కాలేదా..? అని అడిగాడు. లేదని చెప్పేసిన ఈ బ్యూటీ ఇక నుంచి భవిష్యత్‌లో ఎలాంటి ప్రపోజల్స్ చూడాలని అనిపించలేదని తెలిపింది.
'నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిన పనే చేస్తాను.. కాబట్టి నా మనస్సు ఇప్పట్లో ఏ ప్రపోజల్‌ను చూడడానికి ప్రేరేపించలేదు. ఒకరిని ప్రేమించడం అంటే వాళ్ల మొహం చూడడం అనవసరం. ప్రేమ అంటూ చూడకుండానే మొదలు అవుతుంది. అని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరి మొఖాన్ని చూడకుండా ప్రేమలో ఎలా పడుతావు అంటూ సుదీప్ షాక్ అయ్యాడు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ టాపిక్ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment