లైట్ బాయ్‌గా సినీ జీవితం ప్రారంభించి అచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్ స్టార్‌గా నిలబడి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ హీరో దర్శన్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నిసార్లు జైలు ముఖం చూసినా ఆయనలో మార్పు రాలేదు. 2011 సెప్టెంబర్ 9న దర్శన్‌పై భార్య విజయలక్ష్మి వేధింపులు, దాడి,హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ జైలుకు వెళ్లాడు. తరువాత భార్య రాజీ కావడంతో కేసు వెనక్కు తీసుకోగా జైలు నుంచి బయటకు వచ్చాడు. దర్శన్ జైలుకు వెళ్లి వచ్చాక ఆయన సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. వాటిలో సారథి సినిమా మొదటిది.
2018లో సెప్టెంబర్ 24న మైసూరులో దర్శన్ ఎస్‌యూవీ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నటుడు దేవరాజ్, స్నేహితులు ఉన్నారు. 2021లో మైసూరులోని ఒక హోటల్‌లో వెయిటర్‌పై శారీరకంగా దాడికి దర్శన్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విచారణ తర్వాత CCTV విజువల్స్ తొలగించబడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత వెయిటర్‌కు రూ. 50,000 నష్టపరిహారం అందించారు. భరత్ అనే కన్నడ చిత్ర నిర్మాతను 2022లో దర్శన్ బెదిరించాడు. ప్రాణభయంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2023 జనవరి 20న దర్శన్‌పై వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద కేసు నమోదైంది.
2023 అక్టోబర్ 28న పెంపుడు కుక్కను తనపై వదిలి దాడి చేయించాడని దర్శన్ ఇంటికి దగ్గర్లో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్కింగ్ స్థలం విషయంలో తన కేర్‌టేకర్‌తో ఆ మహిళ వాగ్వాదానికి దిగినందున దర్శన్ ఈ పని చేశాడని తెలిసింది. అయితే, ఆ మహిళకు ఆసుపత్రి చికిత్స ఛార్జీలతో పరిహారం చెల్లించాడు.
2024 జనవరి 4వ తేదీన బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో లేట్‌నైట్ పార్టీ చేసారని దర్శన్ అండ్ గ్యాంగ్‌పై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆయన నిజ జీవితంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గతంలో జైలుకు వెళ్లి వచ్చారు. అయినా దర్శన్‌లో ఎలాంటి మార్పులు రాలేదని నెటిజన్లు అంటున్నారు.
తప్పులు మీద తప్పులు చేస్తూ చివరకు ప్రియురాలి కోసం ఒక హత్యకు కారణం అయ్యాడని వారు తెలుపుతున్నారు. పేద కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. లైట్ బాయ్‌గా తన ప్రయాణం కొనసాగించిన దర్శన్ ఆపై కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇంతటి సాహసానికి పాల్పడ్డాడంటే అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment