
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం యంగ్ హీరోకు సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
(ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత)
కాగా.. అడివి శేష్, సుప్రియ గతంలో కూడా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. మరీ ఈ రూమర్స్‌పై అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
(ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ)
కాగా.. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్‌గానూ నటించింది. అడివి శేష్, సుప్రియ గూఢచారి చిత్రంలో నటించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment