Supriya Yarlagadda
-
మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్ హీరో: నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్.. టాలీవుడ్‌కు ఇదొక వరం లాంటిది. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించాక ఇక్కడ సినిమా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని 1975లో పునాదిరాయి పడింది. అలా ఇక్కడ మన తెలుగు సినిమాకు పునాదిరాయిగా అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగింది. అది పూర్తి అయిన తర్వాత అక్కడే ఎన్నో సినిమాలకు చెందిన పనులు జరిగేవి.. నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక పెద్ద సంస్థ. అందులో ఎంతో మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అధునాతన సాంకేతికతకు ఫిలిమ్ స్కూల్ వంటి ఏర్పాట్లకు అంకురార్పణ చేసిన స్టూడియో ఇది. అవుట్డోర్ సెట్లు, ఇండోర్ అంతస్తులు, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మొదలైన సేవలను ఈ స్టూడియో అందిస్తోంది. నేడు ఆ స్టూడియో ఈ రేంజ్‌కు చేరుకోవడానికి ప్రధాన కారణం నాగార్జున అక్కినేనితో పాటు అమల, సుప్రియ అనే చెప్పవచ్చు. అయితే సంస్థ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ దగ్గరే అన్నపూర్ణ స్టూడియోస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రామాచారి అనే ఉద్యోగి గురించి నాగార్జున స్పెషల్‌గా చెబుతూ అన్నపూర్ణ స్టూడియో హీరోస్ పేరుతో ఒక వీడియో విడుదల చేశారు. 1976లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ప్రారంభించాము.. అప్పట్లో నాగేశ్వరరావు గారి దగ్గర చేరిన మొదటి ఉద్యోగి రామాచారినే... 47 ఏళ్లుగా మా వద్ద నిజాయితీగానే పనిచేస్తున్నారని చెప్పడం కంటే మా ఇంట్లో మనిషిలా చేరిపోయాడు అని చెప్పడం కరెక్ట్. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే యాక్టివ్‌గా పనిచేస్తారు. మా డబ్బులు అన్ని ఇనప్పెట్టెల్లో పెట్టి దాని తాళం ఆయనకు ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చని నాగార్జున చెప్పారు. (ఇదీ చదవండి: ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్) ఇక అదే వీడియోలో రామాచారి మాట్లాడుతూ... 'నేను అన్నపూర్ణ స్టూడియోలో చేరిన మొదటి ఉద్యోగిని.. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం. అక్కినేని వారు నన్ను సొంత కుటుంబ సభ్యుడి మాదిరే చూసుకుంటారు. నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏంతో సహాయం చేయడమే కాకుండా నాకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నాగార్జున గారు ముందు ఉంటారు.' అని ఆయన చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు తాము ఇంత స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా కష్టపడింది ఉద్యోగులే అని నాగార్జున తెలిపారు. వారి వల్లే మేము ఇలా ఉన్నాం అన్నారు. అలాగే తమ ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని ఆయన చెప్పారు. హీరోస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అనే సిరీస్ లో భాగంగా అక్కడ పనిచేస్తున్న వారి గురించి అందరికి తెలియాలని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి ఇంత ప్రత్యేకతను ఇచ్చిన నాగార్జునను సోషల్ మీడియా పలువురు అభినందిస్తున్నారు. -
తెలుగు ప్రేక్షకులకు దండం పెట్టాలి: సుప్రియ
‘‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ చూడగానే నవ్వొచ్చింది. ప్రపంచంలో కెల్లా మంచి ప్రేక్షకులు మన తెలుగువాళ్లే. మంచి సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. అందుకే మన ప్రేక్షకులకి దండం పెట్టాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో, అతిథిగా రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ఈ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’గా అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రలు చేశారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ చెప్పిన విశేషాలు. ► ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ సినిమాని అనువదించడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే వందకు పైగా వాయిస్‌లు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి వాయిస్‌ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు డబ్ చేశాం. ‘బాయ్స్ హాస్టల్’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్లు సినిమాలను చాలా చక్కగా చేస్తున్నారు.. అందుకే వాళ్లతో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ► వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘మనం’ సినిమా షూటింగ్ మరో పది రోజులు ఉందనగా తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి తెలిసింది. అప్పటికే ఆయన 255 సినిమాలు చేశారు. ‘మనం’ ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలనుకున్నపుడు ఎంతో ఒత్తిడి ఉండేది. రోజుకు 22 గంటలు పని చేశాం. అయితే ఆ టైమ్‌లో ఎవరితోనూ తిట్టించుకోవడం గొప్ప విషయం (నవ్వుతూ). తాతగారు ఇప్పటికీ నెలకోసారి కలలోకి వచ్చి నన్ను తిడుతుంటారు (నవ్వుతూ). ► నాగార్జునగారి కంటే మంచి నిర్మాత ఎవరూ లేరు. ఆయన యాక్టర్ అవ్వడం వల్లే అన్నపూర్ణ స్టూడియో నిలిచిందని భావిస్తాను. స్టూడియో ప్రారంభమైన కొత్తల్లో కరెంటు బిల్లు కూడా కట్టేంత ఆదాయం వచ్చేది కాదు. తాత, అమ్మమ్మ (ఏఎన్ఆర్–అన్నపూర్ణ) బాధ పడేవారు. ఇప్పుడు ఈ స్టూడియో ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాతగారు, నాగార్జునగారి కృషి ఉంది. నాకు యాక్టింగ్ వస్తుందా? రాదా అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను (నవ్వుతూ). ‘గూఢచారి 2’లో నా పాత్ర ఉంటే నటిస్తాను. మా బ్యానర్లో నాగచైతన్య, అఖిల్‌లతో ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. -
నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం యంగ్ హీరోకు సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) కాగా.. అడివి శేష్, సుప్రియ గతంలో కూడా రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరీ ఈ రూమర్స్‌పై అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) కాగా.. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్‌గానూ నటించింది. అడివి శేష్, సుప్రియ గూఢచారి చిత్రంలో నటించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. -
చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ
‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం’అన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుప్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తాత గారు ఎంత ఇచ్చారు.. దాన్ని చిన్న మామ (నాగార్జున) ఎంతలా పెంచారు.. అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతగారు ఉన్నపుడు విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కట్టారు. చిన్న మామ నిలబెట్టారు. తాతగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. సుమంత్‌ను ఇంకా ఎక్కువగా గారాభం చేసేశారు. ►అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా అంటే దాదాపుగా నేనే కథలు వింటాను. ఒకవేళ చిన్న మామ, చైతూ హీరోలుగా కథలు వస్తే ముందు వాళ్లకే వినిపిస్తాను. నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఈ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వాను అంటే ఓ పది మంది నవ్వుతారనే కదా. అందుకే ఈ సినిమా చేశాను. ►ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. కానీ శ్రీను ఉన్నాడు. మన జోకులు, మన నేటివిటీని మిస్ అవుతుంటాం. ఈ కథలో అది ఉంటుంది. ఏప్రిల్ 1న విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాల్లా ఉంటుంది. ►రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, ఆ ఎగతాళి అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తరువాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. ఈ కథలో తను ఉంటే, తను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అది స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటాను. ►సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాం. అప్పుడే లాక్డౌన్ మొదలైంది. కానీ కరోనా వల్ల ప్రేక్షకులు చూసే కంటెంట్ కూడా మారింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ చూడటం అలవాటు పడ్డారు. ►చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ►ప్రస్తుతం ఉన్న సమయంలో అందరూ థియేటర్‌కు రావడమంటే కష్టం. కానీ ఎక్కడో చోట మొదలుపెట్టాలి. మన ఊరు, నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అంతా మిస్ అవుతున్నారు. ఇందులో అవన్నీ ఉంటాయి. పచ్చడన్నం లాంటి సినిమా. ►ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమానే. ఈ కథకి ఓటీటీ కరెక్ట్ కాదు. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాగార్జునకి ఇంకా పూర్తి సినిమాను చూపించలేదు. ►ఈ సినిమా తప్పకుండా గుర్తుండిపోతుంది. సరదాగా ఉంటుంది. పెద్ద జీవితం అనుకున్నదాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్.. దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు.. ప్రతీవోడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా సరదాగా సాగేదే అనుభవించు రాజా సినిమా. ►నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. గూఢచారి 2లో మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్ర ఇంకా అందులో సజీవంగానే ఉంది. ►ఒకప్పుడు ప్రతీ విషయంలో ఎంతో ఆలోచించేదాన్ని. ఇది చేస్తే ఇంత డబ్బులు మిగులుతాయా? ఇంత డబ్బులు పోతాయా? ఇలా ఎన్నో ఆలోచించేదాన్ని. నచ్చిందా? నచ్చలేదా? అనేది మాత్రమే చూడాలని తాతగారు చెప్పేవారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశా. ఎక్కువగా కన్ఫ్యూజన్ అనిపిస్తే.. నచ్చలేదా? నచ్చిందా? అనేది ఆలోచించేదాన్ని. నచ్చితే చేసేయడం లేదంటే లేదు. ►ఫ్యూచర్లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి.