అన్నపూర్ణ స్టూడియోస్.. టాలీవుడ్‌కు ఇదొక వరం లాంటిది. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించాక ఇక్కడ సినిమా వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని 1975లో పునాదిరాయి పడింది. అలా ఇక్కడ మన తెలుగు సినిమాకు పునాదిరాయిగా అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగింది. అది పూర్తి అయిన తర్వాత అక్కడే ఎన్నో సినిమాలకు చెందిన పనులు జరిగేవి.. నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక పెద్ద సంస్థ. అందులో ఎంతో మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అధునాతన సాంకేతికతకు ఫిలిమ్ స్కూల్ వంటి ఏర్పాట్లకు అంకురార్పణ చేసిన స్టూడియో ఇది. అవుట్‌డోర్ సెట్‌లు, ఇండోర్ అంతస్తులు, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మొదలైన సేవలను ఈ స్టూడియో అందిస్తోంది. నేడు ఆ స్టూడియో ఈ రేంజ్‌కు చేరుకోవడానికి ప్రధాన కారణం నాగార్జున అక్కినేనితో పాటు అమల, సుప్రియ అనే చెప్పవచ్చు. అయితే సంస్థ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ దగ్గరే అన్నపూర్ణ స్టూడియోస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రామాచారి అనే ఉద్యోగి గురించి నాగార్జున స్పెషల్‌గా చెబుతూ అన్నపూర్ణ స్టూడియో హీరోస్ పేరుతో ఒక వీడియో విడుదల చేశారు.
1976లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ప్రారంభించాము.. అప్పట్లో నాగేశ్వరరావు గారి దగ్గర చేరిన మొదటి ఉద్యోగి రామాచారినే... 47 ఏళ్లుగా మా వద్ద నిజాయితీగానే పనిచేస్తున్నారని చెప్పడం కంటే మా ఇంట్లో మనిషిలా చేరిపోయాడు అని చెప్పడం కరెక్ట్. ఇప్పుడు ఆయనకు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే యాక్టివ్‌గా పనిచేస్తారు. మా డబ్బులు అన్ని ఇనప్పెట్టెల్లో పెట్టి దాని తాళం ఆయనకు ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చని నాగార్జున చెప్పారు.
(ఇదీ చదవండి: ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్)
ఇక అదే వీడియోలో రామాచారి మాట్లాడుతూ... 'నేను అన్నపూర్ణ స్టూడియోలో చేరిన మొదటి ఉద్యోగిని.. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం. అక్కినేని వారు నన్ను సొంత కుటుంబ సభ్యుడి మాదిరే చూసుకుంటారు. నేను ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏంతో సహాయం చేయడమే కాకుండా నాకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నాగార్జున గారు ముందు ఉంటారు.' అని ఆయన చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు తాము ఇంత స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా కష్టపడింది ఉద్యోగులే అని నాగార్జున తెలిపారు. వారి వల్లే మేము ఇలా ఉన్నాం అన్నారు. అలాగే తమ ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని ఆయన చెప్పారు.
హీరోస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అనే సిరీస్ లో భాగంగా అక్కడ పనిచేస్తున్న వారి గురించి అందరికి తెలియాలని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి ఇంత ప్రత్యేకతను ఇచ్చిన నాగార్జునను సోషల్ మీడియా పలువురు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment