
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘హిట్ 2’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకులను పలకరించింది.నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
(ఇది చదవండి: HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ)
అయితే తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అడివి శేష్ రెమ్యునరేషన్‌పై నెటిజన్ ఆశ్చర్యానికి గురయ్యారు. గూగుల్‌లో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేస్తే 450 మిలియన్ డాలర్లు చూపిస్తోందని నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి హీరో అడివి శేష్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందో ఒకసారి చూద్దాం.
నెటిజన్ ట్వీట్ చేస్తూ..' అన్నా ఎందన్నా ఇది? గూగుల్‌లో తప్పుడు సమాచారం వస్తోందని నాకు తెలుసు. అయినా ఉత్సాహంతో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేశా. అందులో 450 మిలియన్ డాలర్లు అని వచ్చింది. ఒక్కసారిగా నా నరాలు కట్ అయిపోయాయి అన్నా.' అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్ అభిమానికి రిప్లై ఇచ్చారు. మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.' అంటూ ట్వీట్ చేశారు.
Maaku kooda aa $450M ekkadundho chepthe break ivvadaaniki ready ga unnaam. 🐶 https://t.co/27YvTzR1yx
— Adivi Sesh (@AdiviSesh) December 7, 2022
Comments
Please login to add a commentAdd a comment