Adivi Sesh's 'HIT 2' OTT Release Date and Platform! - Sakshi
Sakshi News home page

HIT 2 OTT Release : ఓటీటీలోకి అడివి శేష్‌ హిట్‌-2.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే

Published Thu, Jan 5 2023 3:32 PM | Last Updated on Thu, Jan 5 2023 4:44 PM

Adivi Sesh Hit2 To Stream On Amazon Prime Video From Jan6th - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హిట్‌-2'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్‌ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నా రూ. 129 చెల్లించాల్సి ఉంది.

కానీ జనవరి 6 తర్వాత నుంచి మాత్రం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్‌ అయిన నెల రోజుల తర్వాత హిట్‌-2 స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, ఇందులో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సుహాస్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement