Hit 2 Trailer: Intense and Encounters Thrill, Watch Now! - Sakshi
Sakshi News home page

HIT 2 Trailer : థ్రిల్లింగ్‌ ఎలిమేంట్స్‌తో ఉత్కంఠభరితంగా హిట్‌-2 ట్రైలర్‌

Published Wed, Nov 23 2022 11:59 AM | Last Updated on Wed, Nov 23 2022 1:20 PM

Adivi Sesh Hit2 Trailer : Encounter The Thrills At Every Turn - Sakshi

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్‌-2. డైరెక్టర్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స‌మ్ప‌ర‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి ఇందులో అడివి శేష్ జోడీగా న‌టించింది. డిసెంబర్‌2న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సాధారణంగా ఈ క్రిమినల్స్‌ తెలివి తక్కువ వాళ్లు. కోడి బుర్రలు. ఐదు నిమిషాలు చాలు వీళ్లని పట్టుకోవడానికి’’ అంటూ శేష్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. సంజన  అనే ఒక యువతి హత్య కేసు పోలీస్ ఆఫీసర్ రోల్‌లో శేష్‌ ఎలా పరిష్కరించాడన్నది ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ ఉత్కంఠకు గురి చేసేలా ఉంది.  రావు ర‌మేష్‌, శ్రీనాథ్‌ మాగంటి, కోమ‌లి ప్రసాద్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement