Adivi Sesh Gives Clarity On Why Youtube Removed Hit 2 Teaser From Trending List - Sakshi
Sakshi News home page

Hit 2: ‘హిట్ 2’ టీజర్‌పై యూట్యూబ్‌ ఆంక్షలు.. వివరణ ఇచ్చిన అడివి శేష్‌

Nov 9 2022 3:19 PM | Updated on Nov 9 2022 4:09 PM

Youtube Removed Hit 2 Teaser From Trending List, Adivi Sesh Gives Clarity - Sakshi

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో అడివి శేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్‌ 2’. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా నటిస్తోంది.  శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల టీజర్‌ని విడుదల చేయగా.. ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది.  అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే యూ ట్యూబ్ స‌హా అన్నీ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ‘హిట్ 2’ టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. 

అయితే యూ ట్యూబ్ ‘హిట్ 2’ టీజ‌ర్‌ను తొల‌గించి అంద‌రికీ షాకిచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి తొల‌గించింది. టీజ‌ర్ చూడ‌టానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ ఆంక్ష‌లు విధించింది. టీజ‌ర్‌పై యూ ట్యూబ్ యాక్ష‌న్ తీసుకునే లోపు 9 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.  దీనిపై హీరో అడివి శేష్ వివ‌ర‌ణ ఇస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని వివరిస్తూనే టీజ‌ర్‌ను చూడాల‌నుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు.

ఇలాంటిది ముందే జ‌రుగుతుంద‌ని టీమ్ ముందుగానే ఊహించింది. అయితే అంతా స‌వ్యంగానే జ‌రుగుతుంద‌ని యూనిట్ భావిస్తోంది. యూ ట్యూబ్ నిర్ణ‌యాన్ని చిత్ర యూనిట్ స్వాగ‌తించింది. అదే స‌మ‌యంలో అడివి శేష్ త‌న వీడియోలో రేపు విడుద‌ల‌వుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement