Latest Update On HIT 2 Movie OTT Release Date, Check Deets Inside - Sakshi
Sakshi News home page

HIT 2 Movie In OTT: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన హిట్‌ 2, స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌!

Published Wed, Dec 21 2022 12:18 PM | Last Updated on Wed, Dec 21 2022 12:34 PM

Latest Update on HIT 2 OTT Release Date - Sakshi

హిట్‌ యూనివర్స్‌లో వచ్చిన హిట్‌ 2 ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. కోమలీ ప్రసాద్‌, ఆదర్శ్‌, రావు రమేశ్‌, సుహాస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డిసెంబర్‌ 2న విడుదలైంది. పెట్టిన టైటిల్‌కు పూర్తి న్యాయం చేసి బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఇక క్లైమాక్స్‌లోనే హిట్‌ 3 ఉంటుందని, అందులో నాని హీరోగా నటించనున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే!

తాజాగా హిట్‌ 2 మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రైమ్‌ దీన్ని ఓటీటీ ఆడియన్స్‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట. అదే కనుక జరిగితే హిట్‌ 2 జనవరి 2 నుంచి అందుబాటులోకి రానుంది.

చదవండి: ఒ​కే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్‌, చరణ్‌ ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement