సమంతా.. చెప్పులు చూపించొద్దు!!
క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ సెట్లో ఉన్నారంటే.. అక్కడ నవ్వులు విరబూయాల్సిందే. ఎప్పుడూ బ్రహ్మాండమైన టైమింగుతో పంచ్ డైలాగులు వేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటారు. ఎంతవాళ్లమీదైనా కూడా చాలా సున్నితంగా జోకులు వేస్తూ.. వాళ్లతో సహా ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా చేయడం బ్రహ్మాజీకి తెలిసిన విద్య. ఇటీవల హీరోయిన్ సమంత మీద కూడా బ్రహ్మాజీ మంచి జోకు ఒకటి పేల్చాడు.
ఇటీవల బ్రహ్మాజీ ఓ షూటింగుకు వెళ్తుండగా దారిలో ఓ సిటీబస్సు కనిపించింది. దానిమీద చెప్పులకు సంబంధించిన ఓ ప్రకటనలో సమంత ఉంది. వెంటనే దాన్ని ఓ ఫొటో తీసుకుని.. ట్విట్టర్లో పోస్టు చేశారు. 'నేను నిన్ను ఫాలో అవుతున్నాను.. దయచేసి చెప్పులు చూపించకు' అని అందులో రాశారు. దానికి సమంత ఏం సమాధానం ఇచ్చి ఉంటుందో తెలుసా.. 'హ హ.. హగ్స్'!!
@Samanthaprabhu2 Am following U... Pl don't show Cheppulu.;) pic.twitter.com/XIONjvI5x5
— BRAHMAJI (@actorbrahmaji) November 5, 2014