హైదరాబాద్: జోరుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగి జలసంద్రాన్ని తలపిస్తున్నాయి. కొందరి ఇళ్లల్లోకి అయితే నేరుగా చేపలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తన ఇల్లు నీట మునిగిందని హాస్య నటుడు బ్రహ్మాజీ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. వరద నీటిలో సగం వరకు మునకేసిన ఇంటి ఫొటోలను సైతం పంచుకున్నారు. దీనిపై చమత్కారంగా స్పందిస్తూ.. ‘ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా... దయచేసి మీకు తెలిసిన మంచి పడవ గురించి చెప్పండి’ అని ట్వీట్ చేశారు. (చదవండి: వరదలు : ప్రభాస్ భారీ విరాళం)
అయితే అందరూ దాన్ని సరదాగా తీసుకోలేకపోయారు. హైదరాబాద్ వరదల వల్ల కోట్లాది నష్టం వాటిల్లింది. ఎంతోమంది నిలువనీడకు దూరమయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో విపత్తు మీద జోకులెలా వేస్తాడని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆయన ట్వీట్‌ను తప్పుబడుతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. "మీకంత కష్టంగా ఉంటే హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోండి, ఆంధ్రాలో బెంజ్ కారు కొనుక్కుని తిరగండి" అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై కలత చెందిన బ్రహ్మాజీ తన ట్విటర్ అకౌంట్ డిలీట్ చేశారు. అయితే ఈ వివాదం సద్దుమణిగాక మళ్లీ ట్విటర్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది. (చదవండి: మంచి పడవ గురించి తెలపండి: బ్రహ్మాజీ)
Comments
Please login to add a commentAdd a comment