
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ 19’గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా దిగిన ఓ ఫోటోను సీనియర్ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన బ్రహ్మాజీ ఆ ఫోటోకు ‘అభిమానితో తను.. అభిమానంతో నేను’ అనే కామెంట్‌ను జోడించారు. అంతేకాదు. ఆ కామెంట్ విషయంలో కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు అంటూ మరో ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో టబు, నవదీప్, సుశాంత్, మలయాళ నటుడు జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Caption help chesindi Trivikram garu..😀
— BRAHMAJI (@actorbrahmaji) 2 July 2019
Comments
Please login to add a commentAdd a comment