‘‘మేము (నటీనటులు) ఫ్యా షన్‌తో, నమ్మకంతో, ఆశతో సినిమా చేస్తాం. కష్టపడి మంచి సినిమా చేస్తే ప్రేక్షకాదరణ లభిస్తుందని నేను నమ్ముతా. మంచి కథతో రూపొందిన ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో శర్వానంద్ అన్నారు. నరేష్ అగస్త్య, బ్రహ్మజీ , హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంకా శర్మ ప్రధాన పా త్రల్లో నటించిన చిత్రం ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’. శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించారు.
ఈ సినిమా టీజర్‌ను శర్వానంద్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను, మౌర్య ‘రణరంగం’ సినిమాలో నటించాం. ‘హ్యాష్ ట్యాగ్ మెన్ టూ’ కథ నచ్చి, నిర్మించానని మౌర్య చెప్పినప్పుడు హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘‘నన్ను, కథని నమ్మి ఈ సినిమా నిర్మించిన మౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్ జి. రెడ్డి. ‘‘పురుషుల బాధలను చూపించే చిత్రమిది. మహిళలకూ నచ్చు తుంది’’ అన్నారు బ్రహ్మజీ . ‘‘యంగ్ టీమ్‌తో మంచి సినిమా చేశాను’’ అన్నారు మౌర్య సిద్ధవరం.
Comments
Please login to add a commentAdd a comment