విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేయగా.. క్యారెక్టర్స్ పోస్టర్‌ను క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఇక వినూత్నంగా రూపొందించిన టీజర్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేతుల మీదుగా విడుదల చేయించారు.
‘ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగా నువ్వడుగేస్తుంటే అరెరె నా జగమంటు నీ సగమంటు వేరుగా లేదంటే అదిరే గుండెల చుట్టు కావలి కాస్తూ ఊపిరి నివ్వాలే.. ఏమైపోతానే’ అంటూ సాగే ఈ లవ్ సాంగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ పాటకు శ్రీజో సాహిత్యం అందించగా ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచి ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’
Published Fri, Feb 14 2020 3:25 PM | Last Updated on Fri, Feb 14 2020 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment