O Pitta Katha Movie
-
చిన్న స్క్రీన్ పెద్ద ఊరట
లాక్ డౌన్ కారణంగా కొత్తగా రిలీజ్ కావాల్సిన సినిమాల కంటెంట్ అంతా స్టూడియోల్లోనే ఉండిపోయింది. కొంచెం ఆలస్యం అయినా రేపటి రోజుని చూస్తాయి, విడుదలవుతాయనే గ్యారంటీ ఉంది. కానీ ఇబ్బంది అంతా ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలకే. ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించిన వారం ముందే థియేటర్స్‌ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆల్రెడీ థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతున్న చిత్రాలకు చిక్కొచ్చి పడింది. థియేట్రికల్ రన్ పూర్తి కాకుండా మధ్యలోనే సినిమా ప్రదర్శన ఆగిపోతే నష్టం ఖాయం. అయితే అలాంటి సినిమాలకు ‘డిజిటల్ ప్లాట్ ఫామ్’ ఓ ఊరట అని చెప్పొచ్చు. ఇంటి పట్టున కూర్చుని కాలక్షేపం కోసం ఈ ప్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలను వీక్షిస్తున్నారు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తున్నారు. టీవీ, ల్యాప్ టాప్, ఫోన్.. చిన్ని తెర అయినప్పటికీ పెద్ద ఊరటగా నిలుస్తున్నాయి. ఓ పిట్ట కథ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. నిత్యా శెట్టి, విశ్వంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చెందు ముద్దు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న విడుదలయింది. థియేటర్లో ఆడటానికి స్కోప్ ఉన్నా లాక్ డౌన్‌తో ఆగింది. అందుకే సినిమా విడుదలయిన పదో రోజునే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. పలాస 1978 వర్గ బేధాల గురించి శ్రీకాకుళం నేపథ్యంలో తయారయిన రూరల్ డ్రామా ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6న ఈ సినిమా విడుదలయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్‌లో ఉంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6నే విడుదలయింది. ఈ సినిమాని కూడా ప్రస్తుతం ప్రైమ్‌లో చూడవచ్చు. మధ ‘మధ’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. సుమారు 26 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు, అభినందనలు గెలుచుకుంది. త్రిష్ణ ముఖర్జీ ముఖ్య పాత్రలో శ్రీ విద్య బసవ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 13న విడుదలయింది. అన్ని అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడి ఉండేది. అయితే మార్చి 15 నుంచి థియేటర్స్ క్లోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 8 నుంచి ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలదీ అదే కథ. శివకార్తికేయన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. తెలుగులో ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో అనువదించారు. మార్చి 20న ఈ సినిమా థియేటర్స్‌లోకి రావాలి. కానీ లాక్ డౌన్ కావడంతో సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేశారు. విక్రాంత్, అతుల్య, మిస్కిన్ నటించిన ‘షూట్ ఎట్ సైట్ ఉత్తర్వు’ అనే అనువాద చిత్రాన్ని కూడా నేరుగా ప్రైమ్‌లోనే రిలీజ్ చేశారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి చూపిస్తేనే అది తయారు చేసిన వాళ్లకు ఆనందం. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ‘లాక్ డౌన్’ వల్ల థియేటర్లకు రాకుండా సినిమాలు లాక్ అయ్యాయి. అందరూ ఇంట్లోనే ఉండటంతో వినోదాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే వెతుక్కుంటున్నారు. తెర ఏదైనా సినిమా తెరకెక్కేది ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. ఒక నెల క్రితం వరకూ సినిమా విడుదలయ్యాక డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి రావాలంటే మినిమమ్ 7 నుంచి 8 వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుందని నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలు భావించారు. కానీ ఎన్ని రోజుల్లో ఆన్ లైన్లో సినిమా అందుబాటులోకి రావాలనే వాదన పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో, ఆ సినిమాలకు ఊరట అనే అనుకోవచ్చు. థియేట్రికల్ రెవెన్యూ పరంగా పలు ఇబ్బందులు ఎదురైనా ప్రేక్షకుడి వరకూ సినిమా వెళ్ళింది అనే ఆనందం అయితే కచ్చితంగా మిగులుతుంది. -
ఏ భాషలో అయినా చేస్తా
‘‘నేను తెలుగమ్మాయినే. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశా. సినిమాల పట్ల ఆసక్తితో బాల నటిగా చేశా. ‘అంజి , దేవుళ్ళు’ సినిమాల తర్వాత రామానాయుడు గారి ‘హరివిల్లు’ సినిమా చేశా. ఆ తర్వాత హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించా’’ అని నిత్యాశెట్టి అన్నారు. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యాశెట్టి ముఖ్య పాత్రల్లో చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. నిత్యాశెట్టి మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’కి ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. వెంకటలక్ష్మి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ‘ఓ పిట్టకథ’ బాగుందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చేయడానికి సిద్ధం. ప్రస్తుతం తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
‘ఓ.. పిట్ట కథ’ మూవీ రివ్యూ
టైటిల్: ఓ.. పిట్ట కథ జానర్: రొమాంటిక్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ, తదితరులు సంగీతం: ప్రవీణ్ లక్కరాజు దర్శకత్వం: చెందు ముద్దు నిర్మాత: ఆనంద్ ప్రసాద్ నిడివి: 127.32 నిమిషాలు డిఫరెంట్ టైటిల్‌తోనే టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అనేది క్యాప్షన్. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తదితర స్టార్ నటీనటులుతో పాటు దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడిలు మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?సీనియర్ నటుడు బ్రహ్మాజీ తన కొడుకును గ్రాండ్‌గా లాంచ్ చేశాడా? భారీ ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు నిలబెట్టాయి? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: అరకులో పి.వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి) కిడ్నాప్‌కు గురవడంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. కాకినాడలోని వెంకటలక్ష్మి థియేటర్ యజమాని వీర్రాజు కూతురే వెంకటలక్ష్మి. తల్లి లేని బిడ్డ అని చిన్నప్పట్నుంచి గారాబంగా పెంచుతాడు వీర్రాజు. అయితే అదే థియేటర్లో పనిచేసే ప్రభు (సంజయ్ రావ్)కు థియేటర్ అన్న వెంకటలక్ష్మి అన్న ఎంతో ఇష్టం. అయితే చైనా నుంచి వచ్చిన వీర్రాజు మేనల్లుడు క్రిష్ (విశ్వంత్) కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు. అయితే ఫ్రెండ్స్‌తో కలిసి అరకు వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్‌కు గురవుతుంది. దీంతో ఈ కేసును కాకినాడ ఎస్సై అజయ్ కుమార్ (బ్రహ్మాజీ) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. చివరికి వెంకటలక్ష్మి ఆచూకి లభించిందా? ఇంతకి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ప్రభు, క్రిష్‌లలో వెంకటలక్ష్మి ఎవరిని ప్రేమిస్తుంది? చైనాకు క్రిష్‌కు ఉన్నరిలేషన్ ఏంటి? వీటన్నింటిని తెలుసుకోవాలంటే ‘ఓ పిట్ట కథ’ చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో అందరి పాత్రలు ప్రధానమైనవి. దీంతో ఎవరికి వారు పోటీపడి నటించారనే చెప్పాలి. ముఖ్యంగా సంజయ్, విశ్వంత్ల నటనకు వావ్ అనాల్సిందే. వెంకటలక్ష్మిపై ప్రేమ, దక్కదనే ఆందోళన, జీవితంలో సెటిల్ అవ్వాలనే భయం ఇలా అన్ని కోణాలను తమ నటనలో చూపించారు. విశ్వంత్‌కు కాస్త అనుభవం ఉండటంతో తన పాత్రను అవలీలగా చేశాడు. అయితే తొలి సినిమాలోనే డిఫరెంట్ షేడ్స్ గల పాత్ర లభించడం సంజయ్‌కు దక్కిన గొప్ప అవకాశమనే చెప్పాలి. అయితే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఎమోషన్స్ పలికించడంలో ఇంకాస్త మెరుగుపడాలి. ‘దేవుళ్లు’ సినిమాతో అందరి ఆశీర్వాదాలు పొందిన నటి నిత్యాశెట్టి. ఈ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. తెలుగమ్మాయి కావడం, తొలి సినిమా కావడంతో ఈ సినిమాలో నిత్యాశెట్టి చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా నిత్యాశెట్టి వచ్చిన ప్రతీ సీన్ కలర్ఫుల్గా, కామెడీగా, రొమాంటిక్‌గా సాగిపోతూ ఉంటుంది. ఇక కాకినాడ ఎస్సై పాత్ర పోషించిన బ్రహ్మాజీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఎందుకంటే తన అనుభవంతో ఆ పాత్రను అవలీలగా చేశాడు. మిగతా తారగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: హీరోహీరోయిన్ల ఎంట్రీ, లవ్ సీన్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీతో ఫస్టాఫ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. దీంతో సినిమా యావరేజ్ అనే అభిప్రాయం సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. అయితే అసలు సినిమా అంతా సెకండాఫ్‌లోనే ఉంది. ఫస్టాఫ్‌లో ప్రేక్షకుడికి తెలియకుండా కథలో భాగంగా వేసిన అనేక ముడులను దర్శకుడు ఒక్కొక్కొటి విప్పుకుంటూ వస్తాడు. దీంతో ద్వితీయార్థం అద్యంతం ఆసక్తిగా, ఆశ్చర్యంగా, అసలేం ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ కలగక మానదు. సెకండాఫ్‌లో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఎవరి ఊహకు అందవు. ఇలా సెకండాఫ్‌లో ప్రేక్షకుడు సీట్లలో నుంచి కనీసం పక్కకు కూడా జరగకుండా కూర్చున్నాడంటే క్రెడిట్ మొత్తం స్క్రీన్ ప్లేకే దక్కుతుంది. యువ డైరెక్టర్ చెందు ముద్దు తన పక్కా స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడా సస్పెన్స్ రివీల్ చేయకుండా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడికి డిఫరెంట్ థ్రిల్‌ను కలిగించాడు దర్శకుడు. ఈ విషయంలో చెందుకు డైరెక్టర్‌గా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఇక లవ్ సీన్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే ఓ కిడ్నాప్ కేసును ఛేదించే క్రమంలో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్లలో నాటకీయత లోపిస్తుంది. అంతేకాకుండా ఆ సీన్లు అతికించినట్టు అనిపిస్తాయి. పోలీస్ స్టేషన్ సీన్లను ఇంకాస్త బెటర్‌గా తీర్చిదిద్ది ఉంటే సినిమాకు మరింత బలం చేకూర్చేది. ఇక కామెడీ సీన్లు అక్కడక్కడా నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సస్పెన్స్‌ను రివీల్ చేస్తున్న సమయంలో వచ్చే కామెడీ బాగుంటుంది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ బలం. హీరోహీరోయిన్ల లవ్ సీన్స్, కాకినాడ, అరకును సినిమాటోగ్రఫర్ చాలా అందంగా, రియలస్టిక్‌గా చూపించాడు. పాటలు సినిమా అవసరానికి తగ్గట్టు ఉంటాయి, ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాను చాలా రిచ్‌గా చూపించాడు. ఫైనల్‌గా స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కన్ఫ్యూజన్ చేసినా.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ‘ఓ.. పిట్ట కథ’ చిత్రానికి వెళ్లి చూడొచ్చు. ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే సంజయ్, విశ్వాంత్ల నటన నిత్యాశెట్టి అందం, అభినయం మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ పలు సీన్లలో లోపించిన నాటకీయత - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
మా అబ్బాయి వస్తానంటే యస్ అన్నాను
‘‘తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే తమ పిల్లల్ని కూడా ఆ రంగంలో పైకి తీసుకురావాలనుకుంటారు.. నేను కూడా అలాగే అనుకున్నాను. మా అబ్బాయి సంజయ్ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ‘ప్రయత్నించు.. వర్కౌట్ అయితే ఉండు.. లేకపోతే నీకు నచ్చింది చేసుకో’ అన్నాను. ఒక తండ్రిగా ఎంత సహకారం అందించాలో అంత చేశా. తనని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, ఒక మంచి పాత్ర ద్వారానే తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ‘ఓ పిట్టకథ’ సినిమా చేశాడు’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’లో అమలాపురంలో ఉండే ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్రలో నటించాను. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అదృశ్యం అవుతుంది.. ఎలా అదృశ్యం అయింది? అనే కోణంలో నా పాత్ర సాగుతుంది. ఈ సినిమాలో మంచి స్క్రీన్‌ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. నేను యంగ్‌గా కనిపించడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.. జీ¯Œ ్స ప్రభావం అంతే. ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి బంధాల్ని కొనసాగిస్తున్నాను. హీరోలందరూ ఫ్రెండ్సే. కలిసి పార్టీలు చేసుకుంటాం.. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. ‘ఓ పిట్టకథ’ సినిమాని దర్శకులు కృషవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి.. వంటి వారు చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది.. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘ఆయన రావడం మా అదృష్టం’
విశ్వంత్, సంజయ్రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్యక్రియేషన్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అంతేకాకుండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రావడంతో టాలీవుడ్ ప్రధాన దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. మార్చి 6న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్బంగా బ్రహ్మాజీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ పిట్టకథ ఎలా స్టార్ట్ అయ్యింది ? ఓ పిట్టకథ సినిమా కథ ముందు నాకు దర్శకుడు సాగర్ చంద్ర నాకు రెఫర్ చేశాడు, తాను డైరెక్టర్ చెందును పరిచయం చేశాడు, చెందు కథ చెప్పగానే బాగా నచ్చి ప్రొసీడ్ అయ్యాం. తెలుగులో ఇంతవరకు రాని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రానుంది. మీ పాత్ర గురించి ? ఇది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్, అమలాపురం లో ఉండే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించాను. రెగ్యులర్ సినిమాతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చెయ్యకుండా ఒక మంచి పాత్రలో మా అబ్బాయిని చూడాలని అనుకున్నాను, ఓ పిట్టకథ సినిమా కథలో మా అబ్బాయి పాత్ర నచ్చి ఈ సినిమా చెయ్యమని చెప్పాను. మా అబ్బాయి ఆర్టిస్ట్ కంటే ముందు డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కక కొన్ని విషయాలు నేర్చుకున్నారు. మీరు వర్క్ చేసిన హీరోల గురించి ? ప్రస్తుతం ఉన్న మన తెలుగు హీరోలందరు కలసిమెలిసి ఉంటారు. కొందరు వారిని వేరుగా చూస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు, నాకు అందరూ హీరోలతో ఉన్న అనుబంధంతో అందరితో కలిసి నటించాను. ముఖ్యంగా చిరంజీవి గారు బిజీ షెడ్యూల్ లో మా పిట్టకథ సినిమా ఫంక్షన్ కు రావడం మా అదృష్టం. అలాగే మా టీజర్ ను విడుదల చేసిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓ పిట్టకథ ఎలా ఉండబోతొంది ? కొత్తవారు చేసిన సినిమాలు చూడడానికి జనాలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటి సందర్భంలో ఆడియన్స్ ను అలరించాలి అంటే సినిమాలో కొత్తదనం ఉండాలి, ఓ పిట్టకథ సినిమా కంటెంట్ ఫ్రెష్ గా ఉండబోతొంది. ఇదివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కొంతమంది దర్శకులు ఓ పిట్టకథ సినిమా చూసి బాగుందని చెప్పారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు కొన్ని మార్పులు చెప్పడం జరిగింది, ఆయన సూచనలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. సినిమా పూర్తి అయ్యాక చంద్రశేఖర్ యేలేటి గారు సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. డైరెక్టర్ చందు ముద్దు గురించి ? సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ గా దర్శకుడు చందు ముద్దు సినిమాను తెరకెక్కించాడు. చాలా క్లారీటి ఉన్న దర్శకుడు తను, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను మంచి నిర్మాణ విలువలతో నిర్మించారు. తదుపరి చిత్రాలు ? అల్లు అర్జున్ & సుకుమార్ సినిమా, చిరంజీవి కొరటాల శివ సినిమాల్లో నటిస్తున్నాను. -
‘కథ వినకుండా సినిమా ఒప్పుకున్నా’
‘‘చంద్రశేఖర్ యేలేటిగారి దర్శకత్వంలో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆ తర్వాత నాకు సరైన కథ రాలేదు.. దీంతో యేలేటిగారితో ప్రయాణం మొదలుపెట్టాను. ఆ సమయంలో ‘ఓ పిట్టకథ’ సినిమా గురించి చెప్పి, కథ చాలా బాగుంది.. చేస్తావా? అని అడిగారు. ఆయన మీద నమ్మకంతో కథ వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు విశ్వంత్. ‘మనమంతా’, ‘తోలుబొమ్మలాట’ ఫేమ్ విశ్వంత్, సంజయ్ రావు హీరోలుగా, నిత్యా శెట్టి హీరోయిన్గా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వంత్ మాట్లాడుతూ– ‘‘పిట్టకథ’ చిత్రంలో మూడు పాత్రలు ముఖ్యమైనవి. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ ఉంటుంది. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది వెండితెరపై చూడాల్సిందే. నేను ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. ‘పిట్టకథ’లో చేసిన క్రిష్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి.. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశాను. ‘ఓ పిట్టకథ’ స్క్రీన్‌ప్లే నేపథ్యంలో సాగుతుంది. ఆ స్క్రీన్‌ప్లే గేమ్ కొరటాల శివగారికి, మా గురువు చంద్రశేఖర్‌గారికి నచ్చింది. ‘తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా రావడం కొత్త. ‘పిట్టకథ’ అంటే చిన్నదికాదు.. పెద్ద కథ’ అన్నారు కొరటాల శివగారు. గ్రామీణ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా ‘పిట్టకథ’ అని టైటిల్ పెట్టాం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరు తీసుకువచ్చాయి.. కానీ, వాణిజ్య పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇటీవల ‘కాదల్’ అని ఒక సినిమా చేశా.. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తుందనుకుంటున్నాను. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
‘కథ వినకుండా ‘ఓ పిట్ట కథ’ ఒప్పుకున్నా’
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించాడు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నేను నటుడిగా ఇంతవరకు చేసిన పాత్రలు వేరు. పిట్టకథలోని నా పాత్రలో పలు వేరియేషన్స్ వున్నాయి. నటన పరంగా దాదాపు క్రిష్ అనే నా పాత్రకు పూర్తి న్యాయం చేశాను’ అని కథానాయకుడు విశ్వంత్ తెలియజేశారు. పిట్టకథ అంటే ఏమిటి? ఎవరికి సంబంధించిన టైటిల్? ఇందులో ముగ్గురు క్యారెక్టర్లు ప్రధానం. ముగ్గురికీ ఒక్కో పిట్టకథ వుంటుంది. అవి ఒక్కోక్కరికి రిలేటెడ్‌గా వుంటాయి. ఏ పాత్ర ఎలా చెబుతుందనేది విజన్. అది ఎలా అనేది తెలియాలంటే వెండితెరపై చేయాల్సిందే. కొరటాలగారు పెద్దకథ అన్నారు? దానికి కారణం? దర్శకులకు సినిమా గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది స్క్రీన్‌ప్లే గేమ్. దాని గురించి తెలిసి ఆయనకు బాగా నచ్చింది. మా గురువుగారు చంద్రశేఖర్ ఏలేటిగారికీ నచ్చింది. అలా కొరటాగారికి ఈ స్క్రీన్‌ప్లే నచ్చి తెలుగులో ఇటువంటి స్క్రీన్‌ప్లే బేస్డ్ చాలా కొత్తగా వుంది. పిట్టకథంటే చిన్నదికాదు పెద్ద కథ అని అన్నారు. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది. ఈ సినిమాలో మీరు నటించడానికి కారణం ఏమిటి ? దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారు నా గురువుగారు. ఆయన సినిమాచేశాక ఆయనతోనే జర్నీ చేయాలని ఎక్కువ ఆయనతో ప్రయాణం అయ్యాను. ఆ సమయంలో నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చెందు ముద్దు అనే వ్యక్తి మంచి కథ చెప్పారు. చాలా బాగుంది. చేస్తావా అని అడిగారు. యేలేటిగారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పారని కథ కూడా వినకుండా ఈ సినిమా చెయ్యడనికి ఒపుకున్నా. చంద్రశేఖర్ యేలేటితో మీకు ఉన్న అనుబంధం గురించి ? నేను ఆయన డైరెక్షన్ లో ‘మనమంతా’ సినిమా చేశాను. ఆయన అంటే నాకు చా లా గౌరవం. నాకు సరైన కథ రావడంలేదు, ఒక పర్ఫెక్ట్ సినిమా చెయ్యాలి. మీతో ట్రావెల్ అవుతానని చెప్పి ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఇక స్క్రీన్ ప్లేలో ఆయనకున్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఆలాంటి ఆయనకు ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగా నచ్చింది.. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని పూర్తి నమ్మకం ఉంది. మరెందుకు ఈ సినిమాకి ‘ఓ పిట్టకథ’ అని సింపుల్ టైటిల్ పెట్టారు ? ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే గేమ్ అండి. నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి స్క్రీన్ ప్లే రాలేదు. విలేజ్ నేపథ్యంలో చేశాం కాబట్టి సింపుల్‌గా అనిపిస్తోంది. టైటిల్ అలా పెట్టడానికి కూడా స్క్రీన్ ప్లేనే కారణం. సినిమాలో చాలా యాంగిల్స్‌లో స్క్రీన్ ప్లే నడుస్తోంది. కచ్చితంగా ఈ సినిమా కొత్తగా అనిపిస్తోంది. మీరు థ్రిల్ అయిన పాయింట్ ఏమిటి? సినిమాలో థ్రిల్ అయిన పాయింట్ ఇప్పుడు నేను చెప్పే కంటే.. సినిమా చూశాక ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మీరు ఫీల్ అయితే బాగుంటుంది. అయితే నా క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను ఇలాంటి క్యారెక్టర్లో ఇంతవరకు చెయ్యలేదు. ఇండస్ట్రీలో మీ జర్నీ గురించి? ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే. మంచి సినిమాలు చేస్తాడు అనే మంచి పేరును నాకు తీసుకువచ్చాయి. అయితే కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కౌట్ అవకపోయినా గుడ్ ఫిల్మ్స్ చేశాను అనే సంతృప్తి నాకు ఉంది. నా కెరీర్లో ‘మనమంతా’ లాంటి మంచి సినిమా ఉన్నందుకు గౌరవంగా చెప్పుకుంటా. కమర్షియల్‌గా హిట్ అయితేనే కదా.. ఆ సినిమా నిజమైన హిట్ అనిపించుకుంటుంది ? అవును, కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. అయితే అన్ని సినిమాలు అలా అవ్వవు. బట్, నేను కూడా మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తున్నాను. రీసెంట్గా ‘కాదల్’ అని ఒక సినిమా చేశాను. అది నాకు కమర్షియల్ హిట్ ఇస్తోందని అనుకుంటున్నాను. మీ తదుపరి సినిమాలు? ‘కాదల్’ మూవీ రాబోతుంది. అలాగే ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మరో సినిమా కూడా ప్రస్తుతం షూట్లో ఉంది. ఈ సినిమా ఎమోషనల్‌గా సాగుతూనే కమర్షియల్ యాంగిల్లోనే ఉంటుంది. ఈ రెండు సినిమాలు బాగా వస్తున్నాయి. చదవండి: రాధిక నాకు తల్లి కాదు! ఇలా అయితే ఎలా కరోనా? -
‘ఓ పిట్టకథ’ ఆడియో వేడుక
-
కష్టపడితే స్టార్లు అవుతారు
‘‘ఇప్పటి యువతరానికి నేను చెప్పేది ఒక్కటే. 100శాతం కష్టపడండి.. నమ్మకంతో ఉండండి.. విజయం సాధిస్తారు. సునీల్‌లాంటి వాళ్లు కూడా మనకి ఎంతో స్ఫూర్తి. మేము ఇక్కడికి(ఇండస్ట్రీకి) రాలేమోమో? ఇక్కడ రాణించలేమేమో? అంటూ భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు. ఎవరు ఏం అనుకున్నా అకుంఠిత దీక్షతో మన లక్ష్యం వైపు దూసుకెళ్లిపోండి.. ప్రతి ఒక్కరూ ఇక్కడ సూపర్స్టార్లు.. మెగాస్టార్లు అవుతారు’’ అని హీరో చిరంజీవి అన్నారు. విశ్వాంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, సంజయ్రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితులు చాలా మారిపోయాయి.. కేరవ్యాన్ లాంటి సౌకర్యాలు అవసరానికి వాడుకోవాలే కానీ విలాసాలకు కాదు. ఈ విషయాల్లో మార్పు రావాలి. హీరో, హీరోయిన్ లొకేషన్లో ఉన్నప్పుడే పనికి న్యాయం చేస్తున్నట్లు. కొరటాల శివ దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ఆచార్య’ సినిమా ఉదయం 7గంటలకు షూటింగ్ అంటే ఆ టైమ్‌కి నేను మేకప్‌తో రెడీగా ఉంటున్నా.. నిర్మాతల సంతోషాన్ని చూడాల్సిన బాధ్యత నటీనటులందరిది. చిన్న సినిమాలకు థియేటర్ల కొరత, సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌గారు ఆదేశించడంతో నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు. చందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’ని ముందుకు తీసుకెళ్లిన బ్రహ్మాజీ, ఆనంద్ ప్రసాద్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి మేం రుణపడి ఉంటాం’’ అన్నారు వి. ఆనంద్ ప్రసాద్. ఈ వేడుకలో హీరోలు సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ, సత్యదేవ్, నటులు సునీల్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, నటీమణులు అనసూయ, వర్ష, కెమెరామేన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న పొగిడారని పార్టీ చేసుకున్నాను
‘‘బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అవకాశాలు వచ్చేస్తాయి అనుకోవడం సరైన అభిప్రాయం కాదు. బ్యాక్‌గ్రౌండ్ తొలి అవకాశం వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవ్వరైనా కష్టపడాల్సిందే’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్. ‘ఓ పిట్ట కథ’ సినిమా ద్వారా సంజయ్ హీరోగా పరిచయం అవుతున్నారు. విశ్వంత్, సంజయ్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కించిన ఈ సినిమాను వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ– ‘‘చిన్న ప్పుడు ‘లిటిల్ సోల్జర్స్’ సినిమా కోసం సింగింగ్ ఆడిషన్స్ ఉంటే హాజరయ్యాను. ఆ తర్వాత చదువులో నిమగ్నమయ్యాను. ఉద్యోగం చేయడం సుఖమైన మార్గం అని అమ్మ అభిప్రాయం. అలానే మాస్టర్స్ పూర్తి చేసుకొని లండన్‌లో జాబ్ చేశాను. ఆరేళ్లు జాబ్ చేసిన తర్వాత డబ్బు సంపాదించడం తప్ప ఏం చేస్తున్నాం? అనిపించింది. ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. నాన్నగారు సరే అన్నారు. బాంబేలో అలోక్ మాస్టర్ దగ్గర ఆ తర్వాత తెలుగులో దేవదాస్ కనకాలగారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ‘నక్షత్రం’ సినిమాకు కృష్ణవంశీ గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను. ఆ తర్వాత దర్శకుడు చందు ‘ఓ పిట్ట కథ’ కథతో వచ్చాడు. ఈ సినిమా కోసం మూడేళ్లుగా కలసి పని చేశాం. అమలాపురంలో ఓ టూరింగ్ టాకీస్‌లో పని చేసే కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. తొలిరోజు నాన్నతో కలిసి పని చేసేటప్పుడు ఆయనేం అనుకుంటారో అని టెన్షన్ పడ్డాను. సీన్ అవ్వగానే అమ్మకి ఫోన్ చేసి చెప్పారు. నాన్న నాతో ఏదీ డైరెక్ట్‌గా చెప్పరు. నాన్న అమ్మతో చెబితే అమ్మ నా భార్యకు చెబుతుంది. తను నాకు చెబుతుంది (నవ్వుతూ). చిన్నప్పుడు కోప్పడితే కొన్నిరోజులు మా ఫ్రెండ్ ఇంట్లో దాక్కున్నాను. అందుకే అలా. సాధారణంగా ఆయన నన్ను పొగడరు. ఈ సినిమా చూసి బాగా చేశాడని చెప్పారు. ఆరోజు ఫ్రెండ్స్‌తో కలసి పార్టీ చేసుకున్నాను. ప్రస్తుతం కిశోర్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా పూర్తి చేశాను’’ అన్నారు. -
వెంకటలక్ష్మి అదృశ్యం
విశ్వాంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన చిత్రమిది.. వినోదం కూడా ఉంటుంది. వెంకటలక్ష్మి అనే యువతి అదృశ్యం అవుతుంది.. దానికి కారణాలేంటి? అనేది ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. సెన్సార్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని కథతో నిర్మించిన చిత్రమిది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘నా కెరీర్‌ని మంచి మలుపు తిప్పే చిత్రం ‘ఓ పిట్టకథ’’ అన్నారు నిత్యాశెట్టి. ‘‘అందరం స్నేహితుల్లా కలసిపోయి ఈ సినిమా చేశాం’’ అన్నారు సంజయ్రావు. ‘‘ఈ సినిమా నన్ను మరో మెట్టు పైకి ఎక్కిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విశ్వాంత్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. -
పెద్దవంశీ స్టయిల్లో...
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఏమైపోతానే మనసిక ఆగేలాలేదే...’ పాటను పూజా హెగ్డే విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ‘‘ఈ పాట వెనక ఓ కథ ఉంది. మొదట విజువల్స్ చిత్రీకరించి, ఆ తర్వాత ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది. గతంలో వంశీగారు ‘లేడీస్ టైలర్’కి అలా చేశారు. మా ప్రయోగం కూడా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత ఆనంద్ ప్రసాద్. ‘‘ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఉత్కంఠను రేపుతుంది’’ అన్నారు దర్శకుడు చందు. ఈ సినిమాకు సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సునీల్ కుమార్ యన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
అప్పుడు ‘లేడీస్ టైలర్’.. ఇప్పుడు ‘ఓ పిట్ట కథ’
చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే విడుదల చేసిన ‘ఏమై పోతానే’అంటూ సాగే లవ్ సాంగ్ యూత్ హార్ట్ బీట్స్‌ను పెంచేస్తోంది. కాగా, ఈ సాంగ్ చిత్రీకరణలో ఓ ఆసక్తికర విషయాన్ని నిర్మాత ఆనంద్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ‘ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. పాట చిత్రీకరణలో ఓ తమాషా ఉంది. మూవీలో సన్నివేశం మూడ్‌కు తగ్గట్టుగా అక్కడ లోకేషన్లలో విజువల్స్‌ని తెరకెక్కించాం. తొలుత విజువల్స్ షూట్ చేశాకే హైదరాబాద్‌లో ట్యూన్ కట్టాం. ఇలా ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు వంశీ ‘లేడీస్ టైలర్’ కోసం ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే’ పాటలో ఈ ప్రయోగం చేశారు. విజువల్స్ షూట్ చేసాకే ఇళయరాజాతో ఆ బాణీని సిద్దం చేయించారు దర్శకుడు. ఆ తరహాలోనే మేం చేసిన ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. మార్చి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు. అనంతరం దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘ఒక విలేజ్‌లో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది. పతాకసన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొనసాగుతుంది. ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం’ అని అన్నారు. బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నాడు. చదవండి: బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’ ‘సామజవరగమన’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ -
బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేయగా.. క్యారెక్టర్స్ పోస్టర్‌ను క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఇక వినూత్నంగా రూపొందించిన టీజర్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే ఆశల అంచులపై చిలిపిగా నువ్వడుగేస్తుంటే అరెరె నా జగమంటు నీ సగమంటు వేరుగా లేదంటే అదిరే గుండెల చుట్టు కావలి కాస్తూ ఊపిరి నివ్వాలే.. ఏమైపోతానే’ అంటూ సాగే ఈ లవ్ సాంగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ పాటకు శ్రీజో సాహిత్యం అందించగా ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచి ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
పిట్టకథే కానీ పెద్ద కథ
‘‘పిట్టకథ టైటిల్ చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చ జరుగుతోంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. ‘ఓ పిట్టకథ’ ఈ వేసవిలో ప్రేక్షకులకు చల్లటి ఉపశమనం ఇస్తుంది’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్స్ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించారు. చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. వినోదం, ఉత్కంఠను రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు వి.ఆనందప్రసాద్. ‘‘మార్చిలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ య¯Œ , సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.