ఏ భాషలో అయినా చేస్తా | Nithya Shetty in love with O Pitta Katha | Sakshi
Sakshi News home page

ఏ భాషలో అయినా చేస్తా

Published Mon, Mar 9 2020 6:29 AM | Last Updated on Mon, Mar 9 2020 6:29 AM

Nithya Shetty in love with O Pitta Katha  - Sakshi

‘‘నేను తెలుగమ్మాయినే. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశా. సినిమాల పట్ల ఆసక్తితో బాల నటిగా చేశా. ‘అంజి , దేవుళ్ళు’ సినిమాల తర్వాత రామానాయుడు గారి ‘హరివిల్లు’ సినిమా చేశా. ఆ తర్వాత హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించా’’ అని నిత్యాశెట్టి అన్నారు. విశ్వంత్, సంజయ్‌ రావు, నిత్యాశెట్టి ముఖ్య పాత్రల్లో చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. వి.ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. నిత్యాశెట్టి మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’కి ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది.  వెంకటలక్ష్మి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ‘ఓ పిట్టకథ’ బాగుందని చెప్తుంటే  చాలా సంతోషంగా ఉంది. మంచి పాత్రలు ఏ భాషలో వచ్చినా చేయడానికి సిద్ధం. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement