Brahmaji, Anil Ravipudi Announce Slumdog Husband Release Date - Sakshi
Sakshi News home page

Brahmaji: ప్రతిసారి ఈ గోలేంటని అనిల్‌ రావిపూడి చిరాకు.. మెడపై కత్తి పెట్టిన బ్రహ్మాజీ

Published Sun, Jul 23 2023 4:54 PM | Last Updated on Sun, Jul 23 2023 5:20 PM

Brahmaji, Anil ravipudi Announce Slumdog Husband Release Date - Sakshi

నటుడు బ్రహ్మాజీ కత్తిపట్టుకుని డైరెక్టర్‌ను బెదిరించాడు. ఆ డైరెక్టర్‌ మరెవరో కాదు అనిల్‌ రావిపూడి. మైకు పట్టుకుని బిజీగా ఉన్న అనిల్‌ రావిపూడి దగ్గరకు వెళ్లి అతడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కత్తితో బెదిరించేంత గొడవ ఏం జరిగిందా? అనుకోకండి.. ఇక్కడుంది బ్రహ్మాజీ కదా.. తన కుమారుడి సినిమా రిలీజ్‌ డేట్‌ కాస్త వెరైటీగా అనౌన్స్‌ చేశాడు. ఫన్‌ అండ్‌ ప్రమోషన్‌ కలిపి అనిల్‌ రావిపూడితో రిలీజ్‌ డేట్‌ చెప్పించాడు.

ఈ క్రమంలోనే ఈ సరదా స్కిట్‌ చేశారు. స్కిట్‌లో భాగంగా.. సినిమా షూటింగ్‌లో ఉన్న అనిల్‌ రావిపూడి దగ్గరకు బ్రహ్మాజీ వెళ్లి డిస్టర్బ్‌ చేస్తాడు. అన్న, ఒక వీడియో పెట్టవా? స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పవా? అని అడుగుతాడు. మొన్న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అన్నావ్‌, సాంగ్‌ అన్నావ్‌.. పదేపదే వస్తానే ఉంటవా? నన్ను వదిలెయ్‌ అని కసురుకోవడంతో బ్రహ్మాజీ తన దగ్గరున్న కత్తికి పని చెప్పాడు. మెడ దగ్గర కత్తి పెట్టడంతో అనిల్‌ రావిపూడి.. స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌ జూలై 29న రిలీజ్‌ అవుతుందని చెప్పాడు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది.

ఇకపోతే బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు హీరోగా నటించిన చిత్రం స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఓ శునకం ముఖ్యపాత్రలో కనిపించనుండగా.. జూలై 29న గ్రాండ్‌గా రిలీజవుతోంది.

చదవండి: ఇంతదాకా వచ్చెందుకు సిగ్గెందుకో? ముఖం దాచుకున్న లైగర్‌ బ్యూటీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement