సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌! | Brahmaji Shaved His Head For Sye Raa Narasimha Reddy | Sakshi
Sakshi News home page

సైరా కోసం బ్రహ్మాజీ గుండు..

Published Fri, Oct 4 2019 11:46 AM | Last Updated on Fri, Oct 4 2019 12:13 PM

Brahmaji Shaved His Head For Sye Raa Narasimha Reddy - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రానికి కలెక్షన్లు కురుస్తున్నాయి. అభిమానులే కాదు సినీ తారలు సైతం ‘సైరా నరసింహారెడ్డిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ చిత్ర మేకింగ్‌ కష్టాల్ని మరిచిపోయేలా చేసింది. ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ప్రాణం పెట్టి చేశారనడంలో అతిశయోక్తి లేదు. సైరాలో నటించిన బ్రహ్మాజీ కూడా ఆ కోవకే చెందుతాడు. పాత్ర కోసం తనని తాను మలుచుకోడానికి సిద్ధపడిపోయాడు. అందుకోసం హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడమే కాక గుండు కొట్టించుకున్నాడు. సైరా చిత్రీకరణ సమయంలో గుండు కొట్టించుకున్న చిత్రాలను బ్రహ్మాజీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

సైరాలో ఏదైనా పాత్ర ఇవ్వమని రామ్‌చరణ్‌ను అడిగాను. కానీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇస్తాడనుకోలేదంటూ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇందుకు సినిమా యూనిట్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. ఈ ఫొటోలో గుండు కొట్టిన తర్వాత పూర్తిగా పాత్రలో లీనమైపోయిన బ్రహ్మాజీని చూడవచ్చు. పైగా రామ్‌చరణ్‌ దగ్గరుండి మరీ గుండు కొట్టిస్తున్నాడు. కాగా పోరాట ఘట్టాల్లో బ్రహ్మజీ నటన అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement