
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. రీల్ లైఫ్‌లో తక్కువ ప్రేమకథల్లోనే కనిపించినా రియల్ లైఫ్‌లో మాత్రం అతడికి ఓ ఇంట్రస్టింగ్ ప్రేమకథ ఉంది. ఆల్‌రెడీ పెళ్లై, కొడుకు ఉన్న బెంగాలీ మహిళ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న శాశ్వతితో ఏడడుగులు నడవడమే కాకుండా ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు.
తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థపూరిత ఆలోచనలు వస్తాయోనన్న భయంతో అతడి కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు సంజయ్ రావు. ఓ పిట్టకథ సినిమాతో అతడు తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు. తన కొడుకుతో కలిసి నటించాలనుకున్న బ్రహ్మాజీ ఓ పిట్టకథలో పోలీసుగా నటించి తన కోరిక నెరవేర్చుకున్నాడు. తాజాగా బ్రహ్మాజీ తన భార్య శాశ్వతితో కలిసి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ... 'ఓపక్క మూన్ లైట్, మరోపక్క సన్ రైజ్.. హైస్పీడ్‌లో శాశ్వతి దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్‌డేకు నా చైన్ తాకట్టు పెట్టాను. తనతో బోలెడంత సేపు ఫోన్‌లో మాట్లాడేవాడిని. దాదాపు నా లైఫ్ అంతా పబ్లిక్ బూత్‌లోనే గడిచింది. కానీ తను ఒక్కసారి తిట్టిందంటే మూడు రోజులు భోజనం కూడా చేయలేం' అని చెప్పాడు. శాశ్వతి మాట్లాడుతూ.. తమ పెళ్లిలో డైరెక్టర్ కృష్ణవంశీ కన్యాదానం చేశాడని చెప్పింది. ఒకసారి బ్రహ్మాజీ సడన్‌గా చేయి కోసుకోవడంతో తాను ఆస్పత్రికి తీసుకెళ్లాను అని చెప్పుకొచ్చింది.
చదవండి: ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ మృతి
జియా ఖాన్ కేసులో సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment