సినిమాల్లోనే కాదు సామాజిక మాధ్యమాల్లో కూడా తన అభిమానులను ఎప్పుడూ నవ్విస్తుంటాడు టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్. నటుడు బ్రహ్మాజీతో కలిసి వెన్నెల కిశోర్ సరదాగా తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్లు’ చిత్రంలో హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు అబ్బా ఏం అందం .. ఏమీ లేదు ఏమీ లేదు అంటూ డైలాగ్ ఉంటుంది. అదే సన్నివేశంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి సంభాషణలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment