సంక్రాంతి పాత రోజులను గుర్తుచేసింది
సంక్రాంతి పండుగ పాత రోజులను గుర్తుచేసిందని సినీ నటుడు బ్రహ్మాజీ అన్నారు. ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెం వచ్చిన ఆయనను ‘న్యూస్‌లైన్’ పలకరించింది. స్థానిక సుబ్బారావుపేటలోని సింహాల బొమ్మవీధిలో ఉన్న సమయంలో ఎక్కువగా స్నేహితులతో గడిపేవాడినని చెప్పారు. నటనపై ఆసక్తి ఉండటంతో 1987లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరానని, అప్పటి నుంచి సినీ రంగంతో పరిచయం ఏర్పడిందన్నారు. 150కు పైగా చిత్రాల్లో నటించి నట్లు చెప్పారు. సింధూరం, గులాబీ మంచి బ్రేక్ నిచ్చాయని, అన్నిరకాల పాత్ర లు చేయడం ఇష్టమని తెలిపారు. నటనలో ఆకళింపు, పాత్రలపై అవగాహన ఉంటే నటుడిగా రాణించడానికి గాడ్ ఫాదర్‌లు అక్కర్లేద ని చెప్పారు.
ఎవరో కొంతమంది సినీ పరిశ్రమను శాసిస్తున్నారనేది వాస్తవం కాదన్నారు. ప్రకాష్‌రాజ్‌కు గాడ్ ఫాదర్ లేరని, నితిన్ లాంటి వ్యక్తి పది చిత్రాలు పరాజయం పొందినా ఇటీవల వచ్చిన ఒక చిత్రంతో మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు తెలి పారు. గూడెం 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా మారిందన్నారు. షూటింగ్ రద్దు కావడంతో మిత్రులను కలవాలని ఇక్కడికి వ చ్చాన న్నారు. పాత స్నేహితులను చూడగానే ఎంతో సంతోషం కలిగిందన్నారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, రవి తేజ చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. ప్రకాష్‌రాజ్ నిర్మాతగా, దర్శకుడిగా చేయబోతున్న చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. బస్టాప్ చిత్ర దర్శకుడు మారుతీ తీయబోయే చిత్రంలో నటిస్తున్నానన్నారు. బ్రహ్మాజీని ఆయన మిత్రు లు ైవె సీపీ నాయకులు నత్తి శివ, మారిశెట్టి సుబ్బారావు, ఉడిపి హోటల్ సురేష్ కలిశారు.