భయానికి నవ్వంటే భయం
తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. ‘భయానికి నవ్వంటే భయం’ అన్నది ఉపశీర్షిక. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ‘‘హారర్ నేపథ్యంలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మహి వి.రాఘవ్.
‘‘మనుషులను చూసి దెయ్యాలు భయపడితే ఎలా ఉంటుందన్నదే కథ. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వుతుంటారు. ఇప్పటి వరకూ ఏ హారర్ మూవీనీ అమెరికాలో విడుదల చేయలేదు. తొలిసారి అక్కడ మేము 85 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘గీతాంజలి’ తర్వాత పలు హారర్ కథలు విన్నా. అయితే ఒకే టైప్‌లో ఉండటంతో ఒప్పుకోలేదు. ‘ఆనందో బ్రహ్మ’ కథ విన్న తర్వాత ఈ సినిమా వదులుకోకూడదనిపించింది’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు.