Shakala Shankar
-
ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు
‘‘నటుడిగా సక్సెస్ సాధించిన తర్వాత కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మించాలనుకుని ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాను నిర్మించాను. ఈ సినిమా కోసం తీసుకున్న నటీనటులందరి బలాలు నాకు తెలుసు. అందుకే వేరే దర్శకుడు ఎందుకు? అని నేనే డైరెక్షన్ చేశాను’’ అన్నారు నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై వై. శ్రీనివాస్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథ ఇది. భాగ్యనగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారిని ఓ పోలీసాఫీసర్ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇందులో ఓ షార్ట్‌ఫిల్మ్ గ్యాంగ్ ఎలా ఇరుక్కుకుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వినోదం మాత్రమే కాదు.. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలనే చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమాతో మా మేనల్లుడుని ఆర్టిస్టుగా పరిచయం చేస్తున్నాను. సెంటిమెంట్ కోసం ఈ సినిమా తొలి షాట్‌ను మా నాన్నగారిపై డైరెక్షన్ చేశాను. ల్యాప్‌టాప్‌లో సినిమా చూసుకున్నారాయన. ఇటీవలే నాన్నగారు చనిపోయారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్‌పై ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నా. దర్శకత్వం, నిర్మాణం, హీరో, నటుడు.. ఈ నాలుగింట్లో నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు’’ అన్నారు. -
నర్సాపురంలో షకలక శంకర్ సందడి
పొందూరు(శ్రీకాకుళం) : మండలంలోని నర్సాపురంలో ఆదివారం షకలక శంకర్ సందడి చేశారు. వ్యక్తిగత పనినిమిత్తం గ్రామానికి వచ్చిన శంకర్‌తో అభిమానులు ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజుగారిగది–2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఆనందోబ్రహ్మ చిత్రం హిట్ కావడం ఆనందంగా ఉందన్నారు. -
ఇప్పుడు తెలుగు సినిమాలే సెంటరాఫ్ ఎట్రాక్షన్!
‘‘హారర్ సినిమాలను అంతగా ఇష్టపడను. మాములుగా దెయ్యాలంటే మనుషులు భయపడుతుంటారు. కానీ, మా ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంలో మాత్రం మనుషులకు దెయ్యాలు భయపడతాయి. డైరెక్టర్ మహి చెప్పిన ఈ పాయింట్ ఎగై్జటింగ్‌గా అనిపించింది’’ అన్నారు తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రల్లో మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా తాప్సీ చెప్పిన విశేషాలు... ► స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో నటించడంతోనే నా పనైపోయిందనుకోను... ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాను. అది నటిగా నా బాధ్యత. ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు. అందుకే నా వంతుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. సినిమా చేసేటప్పుడు నా సలహాలను డైరెక్టర్ మహి.వి. రాఘవ్ గౌరవించారు. నేను కూడా ఆయన దగ్గర కొన్ని దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నా. ► ఒకప్పుడు నేను చేసిన తమిళ, తెలుగు చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అందుకే క్యారెక్టర్, స్క్రిప్ట్ పరంగా రాజీపడకూడదనుకున్నాను. హిందీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేస్తూ కొంత కాలం తీరిక లేకుండా ఉన్నాను. అలా అని హిందీలోనే యాక్ట్ చేస్తానని కాదు.. అక్కడ సినిమాల పరంగా నాకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. తెలుగు సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ► ప్రస్తుతం హిందీలో ‘జుడ్వా 2’ చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ‘ఆనందోబ్రహ్మ’ సినిమా ఫలితం కోసం ఎగై్జట్‌గా ఎదురు చూస్తున్నాను. తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో ఎవరైనా క్రీడాకారుల జీవిత చరిత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోను. -
భయానికి నవ్వంటే భయం
తాప్సీ, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. ‘భయానికి నవ్వంటే భయం’ అన్నది ఉపశీర్షిక. మహి.వి రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ‘‘హారర్ నేపథ్యంలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మహి వి.రాఘవ్. ‘‘మనుషులను చూసి దెయ్యాలు భయపడితే ఎలా ఉంటుందన్నదే కథ. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వుతుంటారు. ఇప్పటి వరకూ ఏ హారర్ మూవీనీ అమెరికాలో విడుదల చేయలేదు. తొలిసారి అక్కడ మేము 85 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘గీతాంజలి’ తర్వాత పలు హారర్ కథలు విన్నా. అయితే ఒకే టైప్‌లో ఉండటంతో ఒప్పుకోలేదు. ‘ఆనందో బ్రహ్మ’ కథ విన్న తర్వాత ఈ సినిమా వదులుకోకూడదనిపించింది’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు.