నిఖిల్‌తో అందాల రాక్షసి | Nikhil to romance Lavanya Tripati | Sakshi
Sakshi News home page

నిఖిల్‌తో అందాల రాక్షసి

Published Sat, May 19 2018 3:21 AM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM

Nikhil to romance Lavanya Tripati  - Sakshi

నిఖిల్‌, లావణ్యా త్రిపాఠి,

‘కిర్రాక్‌ పార్టీ’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం తర్వాత నిఖిల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టీ.యన్‌. సంతోష్‌ దర్శకత్వంలో ఆరా సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మూవీ డైనమిక్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్‌ సరసన ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ లావణ్యా త్రిపాఠిని కథానాయికగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటరై్టనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. నిఖిల్‌–లావణ్య జంట ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీల్‌ కలిగిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నాం. ‘విక్రమ్‌ వేద’ ఫేమ్‌ శ్యాం సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్‌ అరోరా, సత్య, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement