
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్నారు వెన్నెల కిషోర్. 2005లో విడుదలైన వెన్నెల చిత్రంతో వెండితెరకు పరిచమయ్యి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్‌గా మారారు.. దాదాపు దశాబ్ద కాలంగా తన కామెడీతో తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్న వెన్నెల కిషోర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ‘హాపి బర్త్‌డే సంతూర్ ఫ్రమ్ యువర్ వన్ అండ్ ఓన్లీ పెన్సిల్‌గాడా’ అంటూ హీరో నాని, వెన్నెల కిషోర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరు వీ చిత్రంలో నటిస్తున్నారు.
Happy birthday santoor @vennelakishore
— Nani (@NameisNani) September 19, 2019
From your one and only
pencilgaada 😘
*Picture caught under the table during his birthday celebrations in Phuket
V at #V going steady 😉 pic.twitter.com/sMr8Tbp7RP
ప్రస్తుతం వీ చిత్ర షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెట్‌లోనే వెన్నెల కిషోర్‌తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీ చిత్రంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా వెన్నెల కిషోర్ తన కామెడీతో కడుపుబ్బ నవ్వించున్నాడట.
Sweet of u sirjeee🤗🤗🤗...Your heart is isopure..thank youuuuu https://t.co/wJr6XcRX2X
— vennela kishore (@vennelakishore) September 19, 2019
Comments
Please login to add a commentAdd a comment