జర్నలిస్ట్‌గా ఫస్ట్ టైమ్
సినిమా చూసిన వారందరూ బాగుందన్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా టిక్కెట్లు దొరకని వారు వచ్చినా మా సినిమా హిట్ అయినట్టే ’’ అన్నారు దర్శకుడు కాజా.
‘‘సినిమా చూసిన వారందరూ బాగుందన్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా టిక్కెట్లు దొరకని వారు వచ్చినా మా సినిమా హిట్ అయినట్టే ’’ అన్నారు దర్శకుడు కాజా. వెన్నెల కిషోర్, నవీన జాక్సన్, కవిత ఆర్.ఎస్ కీలక పాత్రధారులుగా కాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డాటర్ ఆఫ్ వర్మ’. నరేంద్రరెడ్డి బొక్కా నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాజా మాట్లాడారు. ఉత్తేజ్ మాట్లాడుతూ -‘‘మా గురువు రామ్‌గోపాల్‌వర్మ జీవితానికి ఈ కథ దగ్గరగా ఉన్నా... ఈ కథ ఎమోషన్స్ వేరు. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని చెప్పారు. ఇందులో జర్నలిస్ట్‌గా ఫస్ట్ టైమ్ చేశానని, తన కెరీర్‌లో చేయనటువంటి మంచి పాత్ర ఇదని రోజా తెలిపారు. ఇంకా ఈ చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.