మాయా మహల్‌లో... | Vennela Kishore's Maya Mahal Movie | Sakshi
Sakshi News home page

మాయా మహల్‌లో...

Published Mon, Feb 17 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

Vennela Kishore's Maya Mahal Movie

హారర్, కామెడీ, లవ్ మిళితంగా రూపొందిన చిత్రం ‘మాయామహల్’. సింగం సుధాకర్‌రెడ్డి దర్శకత్వంలో మోక్షగుండం అంకయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, ధన్‌రాజ్, టీఎన్‌రాజు, ప్రియ, ప్రాచీ అధికారి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎవ్వరూ ఊహించని రీతిలో కథాకథనాలు ఉంటాయి. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిత్రీకరణ జరిపాం. పాటలు, పోరాటాలు, గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్‌ప్రభు, కెమెరా: ఆర్.మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.గురవారెడ్డి, సహనిర్మాతలు, సూరేపల్లి బాలకృష్ణ, అనిత, సమర్పణ: మోక్షగుండం జయలక్ష్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement