ఏకే రావ్... పీకే రావ్ నవ్విస్తారు! | AK Rao... PK Rao will make you laugh! | Sakshi
Sakshi News home page

ఏకే రావ్... పీకే రావ్ నవ్విస్తారు!

Published Wed, May 14 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

ఏకే రావ్... పీకే రావ్ నవ్విస్తారు!

ఏకే రావ్... పీకే రావ్ నవ్విస్తారు!

‘‘పూర్తి స్థాయి కామెడీ సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడం ఖాయం’’ అని దర్శకుడు కోటపాటి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఎ.కె.రావ్-పి.కె.రావ్’ చిత్రం ద్వారా హాస్యనటులు ధనరాజ్, తాగుబోతు రమేశ్ హీరోలుగా పరిచయమవుతున్నారు. సాయి వెంకటేశ్వర కంబైన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ధనరాజ్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు ఈ పాత్రలకు మేం న్యాయం చేయగలమా లేదా అని ఆలోచించుకుని ఈ సినిమా ఒప్పుకున్నాం. ఇందులో మాకు ఫైట్లు, డాన్సులు ఉన్నాయి. ఎక్కడా ఓవర్‌గా అనిపించదు’’ అని తెలిపారు. ఇందులో కామెడీ విలన్‌గా చేశానని ‘వెన్నెల’ కిశోర్ చెప్పారు. కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని తాగుబోతు రమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రుతి రాజ్, శ్రీరామ్ చౌదరి, స్వర్ణ సుధాకర్, గుత్తి మల్లిఖార్జున్, శివకుమార్ మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement