'Prema Vimanam' teaser launched by Superstar Mahesh Babu - Sakshi
Sakshi News home page

Prema Vimanam Teaser: ఇంట్రెస్టింగ్‌గా 'ప్రేమ విమానం' టీజర్‌.. విడుదల చేసిన మహేశ్‌ బాబు

Published Thu, Apr 27 2023 4:07 PM | Last Updated on Thu, Apr 27 2023 4:18 PM

Prema Vimanam Teaser Launched By Mahesh Babu - Sakshi

సంగీత్‌ శోభన్‌, శాన్వి జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ విమానం'. వెన్నెల కిషోర్‌, అనసూయ భరద్వాజ్‌ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గూఢచారి','రావణాసుర'వంటి హిట్‌ సినిమాలు నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ జీ5తో సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రిలీజ్‌ చేశారు.

ఓ పల్లెటూరిలో ఇద్దరు పిల్లలు కొండనెక్కి విమానం చూస్తుంటారు. అసలు విమానం ఎలా పైకి ఎగిరింది? విమానంలోకి ఎక్కాలన్న కోరికతో పలు సందేహాలతో టీజర్‌ మొదలవుతుంది. సంతోష్‌ కట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement