Prema Vimanam Movie
-
ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్
థియేటర్లలో సినిమాలు సంగతెలా ఉన్నా ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా అలా జీ5లో రిలీజైన 'ప్రేమ విమానం' చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. 'మ్యాడ్' సినిమాతో థియేటర్లలో హిట్ కొట్టిన సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన మార్క్ చేసుకుందీ సినిమా. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) విమానం ఎక్కాలని కలలుకనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా 'ప్రేమ విమానం' సినిమా తీశారు. విడుదలైన వారం పదిరోజుల్లోనే ఈ వెబ్ మూవీ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా కొడుకులు దేవాన్ష్, అనిరుధ్ నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకుడు కాగా.. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) Our heartwarming movie #PremaVimanam has skyrocketed past 50 million streaming minutes, making it the ultimate winner this Dussehra season! 🎉 You can't afford to miss #PremavimanamOnZEE5, currently available for streaming on https://t.co/aXxsNkGNGi. Prepare to be enchanted by… pic.twitter.com/RS92IQjlZA — ABHISHEK PICTURES (@AbhishekPicture) October 21, 2023 -
‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రేమ విమానం నటీనటులు: అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, 'వెన్నెల' కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, జీ 5 నిర్మాత: అభిషేక్ నామా దర్శకత్వం: సంతోష్ కట్టా సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి విడుదల తేది: అక్టోబర్ 12, 2023 ఓటీటీ వేదిక: జీ5 ‘ప్రేమ విమానం’ కథేంటంటే.. రాము(దేవాన్ష్ నామా), లక్ష్మణ్ అలియాస్ లచ్చి (అనిరుధ్ నామా) చిన్న పిల్లలు. విమానం ఎక్కాలనేది వారిద్దరి కోరిక. తమ కోరికను తండ్రి(రవివర్మ)కి చెబితే..పంటలు పండిన తర్వాత కచ్చితంగా విమానం ఎక్కిస్తా అని మాటిస్తాడు. కొన్నాళ్లకే అప్పుల బాధతో తండ్రి ఉరేసుకొని మరణిస్తాడు. తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్) కూలి పనికెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వాళ్లు మాత్రం విమానం ఎక్కాలనే కోరికతో తల్లికి తెలియకుండా రకరకాలు పనులు చేస్తుంటారు. కట్ చేస్తే.. మణికంఠ అలియాస్ మణి(సంగీత్ శోభన్)కు ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత(శాన్వీ మేఘన)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆమెకు కూడా మణిని ప్రేమిస్తుంది. ఆ కారణంగానే మణి ఉర్లోనే ఉంటూ తండ్రి(గోపరాజు రమణ)తో కలిసి కిరాణం కొట్టు రన్ చేస్తుంటాడు. అభితకు అమెరికా నుంచి సంబంధం రావడంతో తండ్రి ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని అభిత..మణితో కలిసి ఊరి నుంచి పారిపోతారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసమే హైదరాబాద్ వస్తారు. మరోవైపు విమానం ఎక్కాలనే పిచ్చితో ఇంట్లో తల్లి దాచిన డబ్బును దొంగిలించి రాము, లక్ష్మణ్ హైదరాబాద్‌కు వస్తారు. ఎయిర్పోర్ట్ కోసం వెతుకుతుంటారు. అప్పుడు వారికి ఎదురైన సమస్యలు ఏంటి? రాము, లక్ష్మణ్‌లు.. మణి, అభితలకు ఎలా కలిశారు? విమానం ఎక్కాలనే వారి కోరిక నెరవేరిందా లేదా? ఊర్లో నుంచి కూతురు పారిపోయిన తర్వాత సర్పంచ్ ఏం చేశాడు? మణి, అభితలు దుబాయ్‌కి వెళ్లారా లేదా? చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. టైటిల్‌కు దగ్గట్టే ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు విమానం స్టోరీ రెండూ ఉంటాయి. విమానం ఎక్కాలనే ఇద్దరి పిల్లల కోరిక.. ప్రేమను దక్కించుకోవాలనే ఓ జంట తపన ఈ చిత్రంలో చూడొచ్చు. ఓ వైపు పిల్లలు, మరో వైపు ప్రేమ జంట.. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ కథలను చెబుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు కొంతమేర సఫలం అయ్యాడు. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా క్లైమాక్స్‌లో ఈ రెండు కథలను ముడిపెడుతూ అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే పిల్లల కథ చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్యే వచ్చిన ‘విమానం’సినిమా గుర్తుకొస్తుంది. మణి, అభితల లవ్‌స్టోరీలో కొత్తదనం లేదు కానీ బోర్ కొట్టదు. విమానం ఎక్కాలనే చిన్న పిల్లల కోరికను తెలుపుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. రైతు ఆత్మహత్యతో కథ ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. డబ్బును చెల్లించేందుకు శాంతమ్మ పడే కష్టాలు భావోద్వేగానికి గురిచేస్తే.. విమానం ఎక్కేందుకు పిల్లలు చేసే పనులు.. స్కూల్ టీచర్ గోపాల్(వెన్నెల కిశోర్)ని అడిగే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు మణి, అభిత లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కథపై ఆసక్తి వచ్చేలోపు శుభం కార్డు పడుతుంది. రెండు వేరు వేరు కథలను బ్యాలెన్స్ చేయడంలో సఫలమైన దర్శకుడు..ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. సినిమాల్లో గుండెల్ని పిండేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని లైట్‌గా చూపించి వదిలేశాడు. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ముందుగా ఈ చిత్రంలో రాము, లచ్చి పాత్రల్లో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామాల గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి తొలి సినిమా అయినా చక్కగా నటించారు. ముఖ్యంగా అనిరుధ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇక ఈ మధ్యే ‘మ్యాడ్’ చిత్రంతో అలరించిన సంగీత్ శోభన్.. ఇందులో ప్రేమికుడుగా నటించి మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంగీత్‌కు జోడీగా శాన్వీ మేఘన తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. శాంతమ్మగా అనసూయ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. వెన్నెల కిశోర్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో ప్రేక్షకులు చూపు ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వీకెండ్లో అంటే గురువారం, శుక్రవారం దాదాపు 29 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు మాత్రం స్పెషల్. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో 29 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానం సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం అనే వెబ్ సిరీస్.. తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 13) జీ5 ప్రేమ విమానం - తెలుగు మూవీ అమెజాన్ ప్రైమ్ మార్క్ ఆంటోని - తెలుగు డబ్బింగ్ మూవీ ఇన్ మై మదర్స్ స్కిన్ - తగలాగ్ మూవీ ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ - ఇటాలియన్ సిరీస్ ద బరియల్ - ఇంగ్లీష్ సినిమా హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) హాట్ స్టార్ గూస్బంప్స్ - ఇంగ్లీష్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ దిల్లీ - హిందీ సిరీస్ మథగమ్ పార్ట్ 2 -తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఇజగ్బాన్ - యోరుబా సినిమా కాసర్ గోల్డ్ - మలయాళ మూవీ ద కాన్ఫరెన్స్ - స్వీడిష్ చిత్రం క్యాంప్ కరేజ్ - ఉక్రేనియన్ సినిమా (అక్టోబరు 15) క్రిష్, త్రిష్ & బల్టిబాయ్: భారత్ హై హమ్ - హిందీ సిరీస్ (అక్టోబరు 15) గుడ్‌నైట్ వరల్డ్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా మట్టికథ - తెలుగు సినిమా మిస్టేక్ - తెలుగు సినిమా సోనీ లివ్ సంతిత్ క్రాంతి సీజన్ 2 - మరాఠీ సిరీస్ ఫాంటమ్ - కొరియన్ సినిమా బుక్ మై షో టాక్ టూ మీ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబరు 15) ద క్వీన్ మేరీ -ఇంగ్లీష్ చిత్రం (అక్టోబరు 15) ద ఈక్వలైజర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ఆపిల్ ప్లస్ టీవీ లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ - ఇంగ్లీష్ సిరీస్ లయన్స్ గేట్ ప్లే పాస్ట్ లైవ్స్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా మురాఖ్ ద ఇడియట్ - హిందీ షార్ట్ ఫిల్మ్ రింగ్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 15) ద లాస్ట్ ఎన్వలప్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఈ-విన్ మిస్టర్ నాగభూషణం - తెలుగు సిరీస్ (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారం థియేటర్లు, ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి. వాటి సంగతి పక్కనబెడితే ఈసారి మాత్రం ఏకంగా 35 వరకు కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో కొన్ని తెలుగు మూవీస్ ఉండగా.. దాదాపుగా హిందీ, ఇంగ్లీష్ చిత్రాలే ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్) అయితే ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల్లో ప్రేమ విమానం, మట్టి కథ సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం, మథగమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇలా ఓవరాల్ గా 35 వరకు మూవీస్-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 09-15 వరకు) అమెజాన్ ప్రైమ్ అవేర్నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 11 ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) - అక్టోబరు 12 ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 13 ద బరియల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13 నెట్‌ఫ్లిక్స్ మార్గాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 09 డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 10 లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 10 బిగ్ వేప్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 11 వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) - అక్టోబరు 11 ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 11 గుడ్‌నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) - అక్టోబరు 12 ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 12 ఇజగ్బాన్ (యోరుబా సినిమా) - అక్టోబరు 13 కాసర్ గోల్డ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 13 ద కాన్ఫరెన్స్ (స్వీడిష్ చిత్రం) - అక్టోబరు 13 క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ సినిమా) - అక్టోబరు 15 హాట్ స్టార్ మథగమ్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 12 గూస్బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13 సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ సిరీస్) - అక్టోబరు 13 ఆహా మట్టికథ (తెలుగు సినిమా) - అక్టోబరు 13 జీ5 ప్రేమ విమానం (తెలుగు మూవీ) - అక్టోబరు 13 సోనీ లివ్ సంతిత్ క్రాంతి సీజన్ 2 (మరాఠీ సిరీస్) - అక్టోబరు 13 జియో సినిమా కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 09 అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 10 కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 11 ద లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 12 మురాఖ్ ద ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 13 రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 15 డిస్కవరీ ప్లస్ స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 09 ఈ-విన్ మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) - అక్టోబరు 13 బుక్ మై షో మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 11 టాక్ టూ మీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 15 ద క్వీన్ మేరీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 15 ఆపిల్ ప్లస్ టీవీ లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13 లయన్స్ గేట్ ప్లే పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13 (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్‌బాబు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
ఓటీటీలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచే!
ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా బోలెడన్ని చిత్రాలు చూసేయగలుగుతున్నాం. అందుకే సినీలవర్స్ ఓటీటీలకు ఇట్టే కనెక్ట్ అయ్యారు. ఎన్ని ఓటీటీలు వచ్చినా ఆదరిస్తూనే ఉన్నారు. అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం ప్రేక్షకులు మెచ్చేలా, వారికి నచ్చేలా కంటెంట్ ఇస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలే డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులో వస్తున్నాయి. తాజాగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఓటీటీ రాకకు సిద్ధమైంది. అదే 'ప్రేమ విమానం'. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శాన్వీ మేఘన హీరోయిన్గా నటించింది. అనసూయ భరద్వాజ్, వెన్నెల కిశోర్ ప్రముఖ పాత్రలు పోషించారు. బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కథేంటంటే.. విమానం ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఓ ప్రేమ జంట.., ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు.. ఇలా వివిధ వ్యక్తుల ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలే ప్రేమ విమానం. ఈ ప్రేమ విమానంలో విహరించాలంటే వచ్చే నెల 13 వరకు ఆగాల్సిందే! Flying high with love♥️ from the 13th of October #Premavimanamhttps://t.co/Cq3Tj5d2HJ#PremaVimanamOnZee5 - A Zee5 Original web film from the super-hit makers of #Raavanasura #Goodachari #Devil#SangeethShobhan @saanvemegghana #DevanshNama #AnirudhNama @anusuyakhasba pic.twitter.com/4XtC0r5d6U — ZEE5 Telugu (@ZEE5Telugu) September 16, 2023 చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో.. -
యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్‌బాబు సపోర్ట్
సంగీత్ శోభన్, శాన్వి జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ విమానం'. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గూఢచారి','రావణాసుర'వంటి హిట్ సినిమాలు నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ జీ5తో సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఓ పల్లెటూరిలో ఇద్దరు పిల్లలు కొండనెక్కి విమానం చూస్తుంటారు. అసలు విమానం ఎలా పైకి ఎగిరింది? విమానంలోకి ఎక్కాలన్న కోరికతో పలు సందేహాలతో టీజర్ మొదలవుతుంది. సంతోష్ కట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. Presenting the teaser of #PremaVimanam! Wishing the team all the very best! ♥️https://t.co/PKys0pqm6m@AbhishekPicture @saanvemegghana@santoshkata @dopjagadeeshch @anusuyakhasba @vennelakishore @anuprubens @vasupotini @mohitrawlyani @ZEE5Telugu — Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2023 -
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ‘ప్రేమ విమానం’
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా, అనసూయ భరద్వాజ్, ‘వెన్నెల’ కిశోర్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’. బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5లపై అభిషేక్ నామా నిర్మిస్తున్న వెబ్ ఫిల్మ్ ఇది. బుధవారం (ఏప్రిల్ 19) అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ‘ప్రేమ విమానం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్లైట్ ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ఓ ప్రేమ జంట, ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయతి్నంచే ఇద్దరు పిల్లలు.. ఇలా వివిధ వ్యక్తుల ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు.. వంటి ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది.