ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ | Prema Vimanam Movie Gets Super Response In OTT, Crossed 50 Million Minutes Streaming - Sakshi
Sakshi News home page

Prema Vimanam Movie In OTT: 'ప్రేమ విమానం'తో సంగీత్ శోభ‌న్‌ మరో బ్లాక్‌బస్టర్

Published Wed, Oct 25 2023 4:24 PM | Last Updated on Wed, Oct 25 2023 5:29 PM

Prema Vimanam Movie OTT Streaming 50 Million Minutes - Sakshi

థియేటర్లలో సినిమాలు సంగతెలా ఉన్నా ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా అలా జీ5లో రిలీజైన 'ప్రేమ విమానం' చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. 'మ్యాడ్' సినిమాతో థియేటర్లలో హిట్ కొట్టిన సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన మార్క్ చేసుకుందీ సినిమా. ఇంతకీ ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

విమానం ఎక్కాలని కలలుకనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా 'ప్రేమ విమానం' సినిమా తీశారు. విడుద‌లైన వారం పదిరోజుల్లోనే ఈ వెబ్ మూవీ 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ మార్క్ చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు. 

ఈ సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా కొడుకులు దేవాన్ష్, అనిరుధ్ నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకుడు కాగా.. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

(ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement