Sangeeth Shobhan
-
MAD OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ,ఎప్పుడు?
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్పై హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది. ‘మ్యాడ్’ కథేంటి? మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj — Netflix India South (@Netflix_INSouth) October 30, 2023 -
ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్
థియేటర్లలో సినిమాలు సంగతెలా ఉన్నా ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా అలా జీ5లో రిలీజైన 'ప్రేమ విమానం' చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. 'మ్యాడ్' సినిమాతో థియేటర్లలో హిట్ కొట్టిన సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన మార్క్ చేసుకుందీ సినిమా. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) విమానం ఎక్కాలని కలలుకనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా 'ప్రేమ విమానం' సినిమా తీశారు. విడుదలైన వారం పదిరోజుల్లోనే ఈ వెబ్ మూవీ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా కొడుకులు దేవాన్ష్, అనిరుధ్ నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకుడు కాగా.. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) Our heartwarming movie #PremaVimanam has skyrocketed past 50 million streaming minutes, making it the ultimate winner this Dussehra season! 🎉 You can't afford to miss #PremavimanamOnZEE5, currently available for streaming on https://t.co/aXxsNkGNGi. Prepare to be enchanted by… pic.twitter.com/RS92IQjlZA — ABHISHEK PICTURES (@AbhishekPicture) October 21, 2023 -
‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రేమ విమానం నటీనటులు: అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, 'వెన్నెల' కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, జీ 5 నిర్మాత: అభిషేక్ నామా దర్శకత్వం: సంతోష్ కట్టా సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి విడుదల తేది: అక్టోబర్ 12, 2023 ఓటీటీ వేదిక: జీ5 ‘ప్రేమ విమానం’ కథేంటంటే.. రాము(దేవాన్ష్ నామా), లక్ష్మణ్ అలియాస్ లచ్చి (అనిరుధ్ నామా) చిన్న పిల్లలు. విమానం ఎక్కాలనేది వారిద్దరి కోరిక. తమ కోరికను తండ్రి(రవివర్మ)కి చెబితే..పంటలు పండిన తర్వాత కచ్చితంగా విమానం ఎక్కిస్తా అని మాటిస్తాడు. కొన్నాళ్లకే అప్పుల బాధతో తండ్రి ఉరేసుకొని మరణిస్తాడు. తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్) కూలి పనికెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వాళ్లు మాత్రం విమానం ఎక్కాలనే కోరికతో తల్లికి తెలియకుండా రకరకాలు పనులు చేస్తుంటారు. కట్ చేస్తే.. మణికంఠ అలియాస్ మణి(సంగీత్ శోభన్)కు ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత(శాన్వీ మేఘన)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆమెకు కూడా మణిని ప్రేమిస్తుంది. ఆ కారణంగానే మణి ఉర్లోనే ఉంటూ తండ్రి(గోపరాజు రమణ)తో కలిసి కిరాణం కొట్టు రన్ చేస్తుంటాడు. అభితకు అమెరికా నుంచి సంబంధం రావడంతో తండ్రి ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని అభిత..మణితో కలిసి ఊరి నుంచి పారిపోతారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసమే హైదరాబాద్ వస్తారు. మరోవైపు విమానం ఎక్కాలనే పిచ్చితో ఇంట్లో తల్లి దాచిన డబ్బును దొంగిలించి రాము, లక్ష్మణ్ హైదరాబాద్‌కు వస్తారు. ఎయిర్పోర్ట్ కోసం వెతుకుతుంటారు. అప్పుడు వారికి ఎదురైన సమస్యలు ఏంటి? రాము, లక్ష్మణ్‌లు.. మణి, అభితలకు ఎలా కలిశారు? విమానం ఎక్కాలనే వారి కోరిక నెరవేరిందా లేదా? ఊర్లో నుంచి కూతురు పారిపోయిన తర్వాత సర్పంచ్ ఏం చేశాడు? మణి, అభితలు దుబాయ్‌కి వెళ్లారా లేదా? చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. టైటిల్‌కు దగ్గట్టే ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు విమానం స్టోరీ రెండూ ఉంటాయి. విమానం ఎక్కాలనే ఇద్దరి పిల్లల కోరిక.. ప్రేమను దక్కించుకోవాలనే ఓ జంట తపన ఈ చిత్రంలో చూడొచ్చు. ఓ వైపు పిల్లలు, మరో వైపు ప్రేమ జంట.. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ కథలను చెబుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు కొంతమేర సఫలం అయ్యాడు. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా క్లైమాక్స్‌లో ఈ రెండు కథలను ముడిపెడుతూ అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే పిల్లల కథ చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్యే వచ్చిన ‘విమానం’సినిమా గుర్తుకొస్తుంది. మణి, అభితల లవ్‌స్టోరీలో కొత్తదనం లేదు కానీ బోర్ కొట్టదు. విమానం ఎక్కాలనే చిన్న పిల్లల కోరికను తెలుపుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. రైతు ఆత్మహత్యతో కథ ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. డబ్బును చెల్లించేందుకు శాంతమ్మ పడే కష్టాలు భావోద్వేగానికి గురిచేస్తే.. విమానం ఎక్కేందుకు పిల్లలు చేసే పనులు.. స్కూల్ టీచర్ గోపాల్(వెన్నెల కిశోర్)ని అడిగే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు మణి, అభిత లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కథపై ఆసక్తి వచ్చేలోపు శుభం కార్డు పడుతుంది. రెండు వేరు వేరు కథలను బ్యాలెన్స్ చేయడంలో సఫలమైన దర్శకుడు..ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. సినిమాల్లో గుండెల్ని పిండేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని లైట్‌గా చూపించి వదిలేశాడు. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ముందుగా ఈ చిత్రంలో రాము, లచ్చి పాత్రల్లో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామాల గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి తొలి సినిమా అయినా చక్కగా నటించారు. ముఖ్యంగా అనిరుధ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇక ఈ మధ్యే ‘మ్యాడ్’ చిత్రంతో అలరించిన సంగీత్ శోభన్.. ఇందులో ప్రేమికుడుగా నటించి మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంగీత్‌కు జోడీగా శాన్వీ మేఘన తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. శాంతమ్మగా అనసూయ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. వెన్నెల కిశోర్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్