వాడ్ని కాపాడలేం : యంగ్‌ టైగర్‌ | NTR Tweeted About His Son Abhay | Sakshi
Sakshi News home page

Jun 9 2018 4:17 PM | Updated on Oct 22 2018 6:10 PM

NTR Tweeted About His Son Abhay - Sakshi

సినీ స్టార్స్‌, వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ముఖ్యంగా వారి అభిమానులకు ఇలాంటి విషయాలపై ఆసక్తి మరీ ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టే టాలీవుడ్‌ టాప్‌ హీరోలైన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ ఇలా హీరోలంతా వారికి సంబంధించిన విషయాలను అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. 

ఎన్టీఆర్‌కు తన కుమారుడు అభయ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అభయ్‌ ఫొటోలను, ఇతర విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు ఎన్టీఆర్‌. తాజాగా ఆయన అభయ్‌కుసంబంధించిన ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘వాడు రోజు తాగాల్సిన పాల కోటాకు సంబంధించిన విషయంలో అభయ్‌ని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం’ అంటూ సరదాగా కామెంట్‌ చేశారు. అభయ్‌ పాలు తాగుతున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు ఎన్టీఆర్‌.  దీనికి ప్రతిగా హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ స్పందిస్తూ.. క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement