శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌.. డిటెక్టివ్‌ టీజర్ చూశారా? | Tollywood Actor Vennela Kishore Srikakulam Sherlockholmes Movie Teaser Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Srikakulam Sherlockholmes Teaser: డిటెక్టివ్‌గా వెన్నెల కిశోర్.. టీజర్ చూశారా?

Published Thu, Nov 28 2024 1:49 PM | Last Updated on Thu, Nov 28 2024 2:36 PM

Tollywood Actor Vennela Kishore Srikakulam Sherlockholmes Teaser Out Now

టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్‌, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌. చంటబ్బాయ్‌ తాలుకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్‌తో తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement