
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ తొలిసారి నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారతీయుడు 2లో వెన్నెల కిశోర్ విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఓ అభిమాని 'ఏంటి కాకా.. ఇది నిజమా?' అని అడిగాడు. దీనికి సదరు కమెడియన్ స్పందిస్తూ.. 'ఇండియన్ 2లో లేను, పాకిస్తాన్ 3లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ రూమర్స్‌కు తెర దించినందుకు థ్యాంక్స్ భయ్యా అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
ఇండియన్ 2 విషయానికి వస్తే.. కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనప్పటికీ వివాదాలు, ప్రమాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం నాన్‌స్టాప్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG
— vennela kishore (@vennelakishore) February 28, 2023
Comments
Please login to add a commentAdd a comment