అతడు... ఆమె... ఓ స్కూటర్
వెన్నెల కిషోర్, ప్రియాంక చాబ్రా జంటగా రూపొందిన చిత్రం ‘అతడు... ఆమె.. ఓ స్కూటర్’. గంగారపు లక్ష్మణ్ దర్శకుడు. అమరేంద్రరెడ్డి నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వించే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. థియేటర్లతో పాటు జింగ్రీల్ డాట్ కామ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, విదేశాల్లో ఈ చిత్రాన్ని వీక్షించాలనుకునేవారు... మూడు డాలర్లు వెచ్చించి ఈ సైట్‌లో చూడొచ్చని వెన్నెల కిషోర్ తెలిపారు.
అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రియాంక చాబ్రా కృతజ్ఞతలు చెప్పారు. బిజినెస్ విషయంలో కూడా సంతృప్తిగా ఉన్నామని చిత్రసమర్పకుడు ముత్తు కుమారస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా కథా రచయిత జగదీష్ బాగ్లీ కూడా పాల్గొన్నారు.