
విష్వంత్, పల్లక్ లల్వాని
‘కేరింత, మనమంతా’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. పల్లక్ లల్వాని కథానాయికగా నటించారు. సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతలపాటి మధు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, ఫీల్, వినోదం... ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సంజయ్ కార్తీక్ ఈ చిత్రం తెరకెక్కించారు.
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. విడుదలయ్యే వరకే మాది చిన్న సినిమా.. రిలీజ్ తర్వాత మంచి విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందనే ఆశాభావంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ప్రేమికుల మధ్య ఉండే ఫీలింగ్స్‌ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు సంజయ్ కార్తీక్. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సుభాష్ దొంతి.