Director Yalamanda Charan Speech About 'Bhuvana Vijayam' - Sakshi
Sakshi News home page

Bhuvana Vijayam: ఓడి గెలిచినవాడి కథ ‘భువన విజయమ్‌’

Published Thu, May 11 2023 10:42 AM | Last Updated on Thu, May 11 2023 10:57 AM

Director Yalamanda charan Talks About Bhuvana Vijayam - Sakshi

‘‘ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే మా ‘భువన విజయమ్‌’ ఓడి గెలిచినవాడి కథ. గెలిచినవాళ్లు ఓడిపోయినవాళ్లని గెలిపించిన కథ. కామెడీ, ఫ్యాంటసీ, థ్రిల్‌.. ఇలా అన్నీ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు యలమంద చరణ్‌. సునీల్, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్, ధనరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’.

(చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? )

కిరణ్, వీఎస్కే నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నటుడు ధనరాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకుడి పాత్ర చేశాను. ఈ చిత్రంలోని పాత్రలని నేను ఎలా చూస్తానో ఆడియన్స్‌ కూడా అలానే చూస్తారని డైరెక్టర్‌ చెప్పడం సవాల్‌గా అనిపించింది’’ అన్నారు. ‘‘యూనిట్‌ సహకారంతో అనుకున్న టైమ్‌కి పూర్తి చేసి, రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్, వీఎస్కే. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మి, సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: సాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement