Kanabadutaledu Teaser: డిటెక్టివ్‌గా సునీల్‌.. ఆసక్తి రేపుతున్న టీజర్‌ - Sakshi
Sakshi News home page

Kanabadutaledu Teaser: ఆసక్తి రేపుతున్న ‘క‌న‌బ‌డుట‌లేదు` టీజర్‌

Published Sat, Jun 26 2021 3:28 PM | Last Updated on Sat, Jun 26 2021 4:02 PM

Kanabadutaledu Teaser Out - Sakshi

సునీల్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం `క‌న‌బ‌డుట‌లేదు`. ఓ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌ నేపథ్యంలో  క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్‌. బాలరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. . 'పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి'.. అంటూ కీలకమైన కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తున్న సునీల్‌ను పరిచయం చేశారు. 

 పోలీసుల‌కు అంతుప‌ట్ట‌ని ఈ కేసు.. డిటెక్టీవ్ ఎలా సాల్వ్ చేశాడ‌న్న‌దే ఈ సినిమా కథ అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. టీజ‌ర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… అన్నీ బాగున్నాయి. సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే స్పార్క్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement