Sinil And Dhanraj Bujji Ila Raa Movie Teaser Released - Sakshi
Sakshi News home page

నువ్వే హీరో అనగానే షాకయ్యాను: ధన్‌రాజ్‌

Published Tue, Oct 19 2021 8:02 AM | Last Updated on Tue, Oct 19 2021 9:10 AM

Sunil And Dhanraj Bulli Ila Raa Movie Teaser Released - Sakshi

సునీల్, ధన్‌రాజ్‌ హీరోలుగా అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. రూపా జగదీశ్‌ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రచయిత, నిర్మాత కోన వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో వందశాతం ఆక్యుపెన్సీ రావడం ఓ శుభసూచకం. ‘బుజ్జీ ఇలారా..’ సక్సెస్‌ కావాలి’’ అన్నారు. ‘‘నాగేశ్వరరెడ్డిగారు కథ చెప్పి, నువ్వే∙హీరో అనగానే షాకయ్యాను’’ అన్నారు ధన్‌రాజ్‌.

‘‘దర్శకుడిగా ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ చిత్రాలను నమ్మి చేస్తే, హిట్టయ్యాయి. కథ–స్క్రీన్‌ప్లే రచయి తగా నమ్మి తీసిన ఈ సినిమా హిట్టవుతుంది’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘అంజి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు అంజి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement