సూపర్‌ హిట్ రీమేక్‌లో సునీల్‌! | Sunil to Star in AndhaDhun Remake | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్ రీమేక్‌లో సునీల్‌!

Published Wed, Jun 12 2019 12:22 PM | Last Updated on Wed, Jun 12 2019 3:47 PM

Sunil to Star in AndhaDhun Remake - Sakshi

ప్రస్తుతం సౌత్, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్‌.

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌లో.. హీరోగా మారి సక్సెస్‌ కాలేక తిరిగి కమెడియన్‌గా నటిస్తున్న సునీల్ లీడ్‌ రోల్‌లో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. హిందీలో హీరోది అంధుడి పాత్ర, మరి సునీల్ ఆ పాత్రకు ఎంత వరకు సూట్ అవుతాడు అన్నది చూడాలి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తమిళ రీమేక్‌లో నటించేందుకు ధనుష్‌, సిద్ధార్థ్‌ లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement