కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ మెప్పించాడు సునీల్. అయితే హీరో పాత్రలోనూ కామెడీ చొప్పించి నవ్వించగల ఘనుడు సునీల్. మర్యాద రామన్న సినిమాలో ఆయన పాత్ర, నటన, కామెడీ అద్భుతంగా పండాయి. 'విలన్ అవుదామని వచ్చి కమెడియన్ అయ్యాను. చాలారకాల పాత్రలు చేసేశానని నాకు పుష్పలో కొత్త గెటప్ వేశారు. నాపైన కోట శ్రీనివాసరావు ప్రభావం గట్టిగా ఉంది. అప్పుడే సీరియస్‌గా చెప్పి వెంటనే నవ్వించగలడు. ఆ చెప్పే విధానం బాగుంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా నాకు ఇన్‌స్పిరేషన్.
అందాల రాముడు సినిమా చేయనని చెప్పా. రెండేళ్లపాటు అదే మాట చెప్పుకుంటూ వచ్చా. కానీ నేనే ఆ సినిమా చేయాలని డైరెక్టర్ లక్ష్మీనారాయణ పట్టు పట్టడంతో చేశాను. మర్యాద రామన్న అనేది భగవంతుడు ఇచ్చిన వరం. పూలరంగడు కోసం బాగా కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాను. నేను ఏ క్యారెక్టర్‌కైనా రెడీగా ఉన్నాను. ఏ పాత్ర వచ్చినా చేస్తాను. తెలుగులో రామ్‌చరణ్- శంకర్ మూవీ, పుష్ప 2, విరూపాక్ష సహా మరో రెండు చిత్రాలు చేస్తున్నాను. అలాగే తమిళ్‌లో మహావీరన్, జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ చేస్తున్నా. హిందీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ డేట్స్ కుదరక కొన్నింటికి న్యాయం చేయలేకపోతున్నా' అని చెప్పుకొచ్చాడు సునీల్. తన కుటుంబం గురించి చెప్తూ.. తన భార్య పేరు శృతి అని కావ్య, దుశ్యంత్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తల్లితో కలిసి అంతా ఒకేచోట ఉంటామని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment