కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ తన కామెడీ టైమింగ్స్‌తో స్టార్ కమెడియన్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే సునీల్ హీరోగా రూటు మార్చారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మర్యాద రామన్న వంటి హిట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అనుకున్నంతగా గుర్తింపు రాకపోవడంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి కలర్ ఫొటో, పుష్ప సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ పాత్రలతో అందరినీ మెస్మరైజ్ చేశాడు.
త్వరలోనే ఎప్-3 సినిమాతో మరోసారి నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఓ మంచి ప్రాజెక్టుతో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం సునీల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comedian Sunil: హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సునీల్!
Published Sat, May 21 2022 6:47 PM | Last Updated on Sat, May 21 2022 6:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment