
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది జీవితాలతో పాటు విచిత్ర వ్యక్తితాలు వింత ప్రవర్తనలు కలిగిన వ్యక్తుల కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుందట.
ఓ కొత్త దర్శకుడు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పాల్ పాత్రలో హాస్య నటుడు సునీల్‌ను నటింపచేయాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ విషయంపై సునీల్ గానీ, ఇతర యూనిట్ సభ్యులు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment