Comedian Sunil To Act In Mandela Telugu Remake? - Sakshi
Sakshi News home page

మండేలా తెలుగు రీమేక్‌: హీరోగా సునీల్‌?

Published Fri, May 7 2021 12:45 AM | Last Updated on Fri, May 7 2021 10:10 AM

Sunil to star in Mandela Telugu remake - Sakshi

ఓ భాషలో హిట్‌ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం తెలిసిందే. తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మండేలా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యోగిబాబు హీరోగా మడోన్నే అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, మంచి హిట్‌ అయింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను అనిల్‌ సుంకర దక్కించుకున్నారు.

తమిళంలో కమెడియన్‌ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్‌ సెటైరికల్‌ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కింది. తెలుగు రీమేక్‌లో హీరోగా సునీల్‌ నటించనున్నారని టాక్‌. మరి.. మండేలాగా సునీల్‌ కనిపిస్తారా? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది త్వరలోనే తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement