Sunil Released Shakalaka Shankar The Boss Never Dies Movie Title Logo - Sakshi
Sakshi News home page

Shakalaka Shankar: అత్యంత వివాదాస్పద చిత్రం టైటిల్ లోగో రిలీజ్‌

Published Mon, Jan 3 2022 12:01 PM | Last Updated on Mon, Sep 5 2022 1:41 PM

Sunil Released Shakalaka Shankar The Boss Never Dies Movie Title Logo - Sakshi

The Boss- Never Dies Movies: బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం "ది బాస్". నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా... బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం 'ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు.

"ది బాస్-నెవర్ డైస్" సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని.... రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం "ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement