'గేమ్‌ చేంజర్‌' షూటింగ్‌లో రామ్‌చరణ్‌కు గాయాలు! | Ram Charan Game Changer Movie Shooting Postponed To October 2023, Know Reason Inside - Sakshi
Sakshi News home page

Game Changer Shooting Update: రామ్‌చరణ్‌కు గాయాలు? 'గేమ్‌ చేంజర్‌' ప్లాన్‌లో మార్పు..

Published Mon, Sep 25 2023 3:53 AM | Last Updated on Mon, Sep 25 2023 12:16 PM

Ram Charan Game Changer shoot postponed to October 2023 - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గేమ్‌ చేంజర్‌’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్‌ చంద్ర, ఎస్‌జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్‌చేంజర్‌’ తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్‌ చేశారు. అయితే ఈ షెడ్యూల్‌ రద్దు అయ్యింది.

‘‘గేమ్‌చేంజర్‌’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్‌కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్‌ రద్దు అయింది. అక్టోబర్‌ రెండోవారంలో తిరిగి షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్‌చరణ్‌కు షూటింగ్‌లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్‌ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్‌ రద్దైనట్లు సమాచారం. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement