
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అలాగే దసరా సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సునీల్‌కు సంబంధించిన లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సునీల్ ‘పెంచలయ్య’ పాత్రలో కనిపించనున్నాడట. పెళ్లి కోడుకు గేటప్‌లో సునీల్ భయపడుతూ కనిపించాడు. ఆయన లుక్ చూస్తుంటే సునీల్ ఈ చిత్రంలో కమెడియన్‌గా అలరించబోతున్నాడు తెలుస్తోంది. లుక్ చూస్తుంటే ఇందులో ఆయన కమెడియన్‌గా అలరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. జి. నాగేశ్వర రెడ్డి కథను అందించిన ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment