బుల్లితెరతోపాటు వెండితెరపైన కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది అనసూయ భరద్వాజ్.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ పలు సినిమాల్లోనూ కీలకపాత్రలో నటించింది. ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరును తీసుకొచ్చింది. మరోవైపు ‘క్షణం’, ‘కథనం’ వంటి సినిమాల్లో ఫుల్‌లెంత్ రోల్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. టెలివిజన్ షోలలో వ్యాఖ్యతగా, న్యాయనిర్ణేతగానూ కొనసాగుతున్న ఈ భామ అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్ యూ బ్రదర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 7న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
దీనితోపాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలకపాత్ర ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో అనసూయ కోసం స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేసి.. ఆ రోల్ కోసం ఆమెను సెలెక్ట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. తాజాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర ఢిఫరెంట్‌గా నెగటీవ్ టచ్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో సునీల్ భార్యగా కనిపించనుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్‌లో రంగమ్మత్తగా చేసిన అనసూయకు రెండో సినిమా పుష్ప ఎలాంటి హిట్‌ను అందించనుందో వేచిచూడాలి. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
చదవండి: థాంక్ యూ బ్రదర్: ఆ డేట్ నుంచి ఆహాలో ప్రసారం..
పుష్పలో అనసూయ: మంచిరోజులున్నాయి అంటూ..
Comments
Please login to add a commentAdd a comment